ఈ నియోజ‌క‌వ‌ర్గాలు ఇక మ‌హిళ‌ల‌కేనా?

మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే ఏపీలోని 25 లోక్ సభ సీట్లలో 8 నియోజకవర్గాలను మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 58 సీట్లను అతివలకే కేటాయించాలి.

Advertisement
Update: 2023-09-21 05:49 GMT

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు ఖాయమని తేలిపోయింది. దీనికి సంబంధించిన బిల్లును నరేంద్ర మోడీ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కొత్త లోక్‌సభ భవనంలో మొదలైన పార్లమెంటు సమావేశాల్లో మొదటి బిల్లుగా మహిళా రిజర్వేషన్‌నే ప్రవేశపెట్టింది. ఈ బిల్లును అన్నీ పార్టీలు దాదాపుగా ఆమోదించటం ఖాయమే. మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే ఎన్నిసీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుందనే చర్చ ఇప్పుడు అన్నీపార్టీల్లోనూ మొదలైంది.

అందుబాటులోని సమాచారం ప్రకారం ఏపీ విషయం చూద్దాం. ఏపీలోని 25 లోక్ సభ సీట్లలో 8 నియోజకవర్గాలను మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 58 సీట్లను అతివలకే కేటాయించాలి. ఒకవేళ నియోజకవర్గాల పునర్విజనలో సీట్లు గనుక పెరిగితే పెరిగే సీట్లలో కూడా మహిళల కోటా పెరుగుతుంది. ఇప్పుడు పార్లమెంటు ఆమోదం పొందుతున్న బిల్లు 2029 జనరల్ ఎలక్షన్స్ నుండి అమల్లోకి వస్తుంది. అంటే వివిధ నియోజకవర్గాల్లో హేమాహేమీలమని అనుకుంటున్న చాలామంది పురుష నేతలకు తమ నియోకవర్గాల్లో పోటీ చేయటానికి 2024 ఎన్నికలే చివరి ఎన్నికలని అర్థ‌మవుతోంది.

ఏఏ నియోజకవర్గాల్లో మహిళల ఓట్లు ఎక్కువగా ఉంటాయో వాటినే మహిళలకు రిజర్వుడు స్థానాలుగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని ప్రకారం చూస్తే లోక్ సభ నియోజకవర్గాల్లో విశాఖపట్నం, నరసరావుపేట, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, నంద్యాల, విజయవాడ 2029 నుండి మహిళలకే సొంతమవబోతున్నాయి.

ఇక అసెంబ్లీ నియోకవర్గాలను చూస్తే భీమిలి, పాణ్యం, గాజువాక, చంద్రగిరి, తిరుపతి, మంగళగిరి, పెనమలూరు, రంపచోడవరం, పెందుర్తి, గురజాల, వైజాగ్ ఉత్తరం, కోవూరు, కర్నూలు, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, గుంటూరు పశ్చిమం, గన్నవరం, మైలవరం, నెల్లూరు రూరల్, తెనాలి, నంద్యాల, అనంతపురం, ఇచ్చాపురం, కడప, శ్రీకాకుళం, చింతలపూడి, రాజమండ్రి, ప్రత్తిపాడు, రాజమండ్రి రూరల్, గుంతకల్లు, కాకినాడ సిటి, పలమనేరు, వైజాగ్ తూర్పు, మాచర్ల, వినుకొండ, కాకినాడ గ్రామీణం, భీమవరం, రాయదుర్గం.

మదనపల్లి, పోలవరం, కావలి, జమ్మలమడుగు, కొత్తపేట, పాయకరావుపేట, శ్రీకాళహస్తి, ప్రొద్దుటూరు, ఆదోని, విజయనగరం, రాయచోటి, కదిరి, రాప్తాడు, ఆలూరు, గుంటూరు తూర్పు, విజయవాడ పశ్చిమం, గూడూరు, ఒంగోలు, బనగానపల్లె, తాడిపత్రి నియోజకవర్గాలు 2029 నుండి మహిళలకే సొంతం.


Tags:    
Advertisement

Similar News