మళ్లీ జగనే సీఎం.. - స్టార్‌ హీరో విశాల్‌ వెల్లడి

తాను జగన్‌ని బయటి నుంచి ఫాలో చేసే వ్యక్తినని విశాల్‌ చెప్పారు. అయినా వైసీపీకి సపోర్ట్‌ చేస్తున్నానని తాను ఎప్పడూ చెప్పలేదని గుర్తుచేశారు. అయినా జగన్‌ చేసే పనులను ఫాలో చేస్తున్నానని చెప్పారు.

Advertisement
Update: 2024-04-17 07:28 GMT

స్టార్‌ హీరో విశాల్‌ తాజాగా ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన సమయంలో దానిని ఖండించిన విశాల్‌.. తద్వారా తెలుగు ప్రజల దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో సీఎం ఎవరు అవుతారంటూ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ప్రశ్నించగా ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ జగనే సీఎం అవుతారని స్పష్టం చేశారు. ప్రజలు ఒక వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారంటే మామూలు విషయం కాదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. తాను ఎవరి మీదనో కోపంతోనో, నమ్మకం లేకనో చెప్పడం లేదని, మీరు అడిగారని చెబుతున్నానంటూ.. తప్పకుండా జగనే మ‌ళ్లీ సీఎం అవుతారు.. అని వ్యాఖ్యానించారు.

జగన్‌ని బయటినుంచి ఫాలో చేసే వ్యక్తిని..

తాను జగన్‌ని బయటి నుంచి ఫాలో చేసే వ్యక్తినని విశాల్‌ చెప్పారు. అయినా వైసీపీకి సపోర్ట్‌ చేస్తున్నానని తాను ఎప్పడూ చెప్పలేదని గుర్తుచేశారు. అయినా జగన్‌ చేసే పనులను ఫాలో చేస్తున్నానని చెప్పారు. ఆయన తండ్రి చనిపోయిన రోజు నుంచి ఇప్పటివరకూ ఏం చేస్తున్నారు? ఎలా అన్నిటి నుంచీ బయటకు వచ్చారు? అనేది చూశానని తెలిపారు. ఇటీవల జగన్‌పై జరిగిన దాడిని రాజకీయ కోణంలో చూస్తారా అని ప్రశ్నించగా.. ఇలాంటి అటాక్‌ లు ఆయనకు కొత్తేమీ కాదన్నారు. ఇంతకుముందు ఎయిర్‌ పోర్ట్‌లోనూ దాడి జరిగిందని, ఆ కత్తి వచ్చి పొడుచుకుని ఉంటే వేరే విధంగా ఉండేదని వివరించారు. కానీ జగన్‌ అన్ని విషయాల్లో ధైర్యవంతుడని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రాయలసీమ నుంచి వచ్చిన వారికి ధైర్యం, తెగువ ఎక్కువ అని ఆయన తెలిపారు.

Tags:    
Advertisement

Similar News