స్కూల్‌ గోడ కూలి విద్యార్థులు, టీచర్ కి గాయాలు

కొత్త పాఠశాల భవనంలో విద్యార్థులను, ఉపాధ్యాయులను ఖాళీ చేయించకపోవడమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Update: 2022-12-23 11:31 GMT

కర్నూలు జిల్లా కౌతాళం మండలం హాల్వి స్కూల్ లో నాడు-నేడు పనుల్లో నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పాత స్కూల్ భవనం కూల్చివేత స‌మ‌యంలో దానికి ఆనుకొని ఉన్న కొత్త పాఠశాల భవనంలో చదువుకుంటున్న విద్యార్థులు గాయపడ్డారు. టీచర్ సుజాత అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. టీచర్ కూడా గాయాల పాలైంది. పాఠశాల పాత భవనం జేసీబీతో కూల్చివేత స‌మ‌యంలో దానిని ఆనుకుని ఉన్న కొత్త పాఠశాల భవనంలో విద్యార్థులను, ఉపాధ్యాయులను ఖాళీ చేయించకపోవడమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గాయపడిన విద్యార్థులు, టీచర్ ని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 



 


Advertisement

Similar News