20మందిని వదిలేసి వెళ్లిన విమానం.. గన్నవరంలో గోల గోల

ఇటీవల ఇలాంటి ఉదాహరణలు చాలానే జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి. ఏకంగా 20మందికి కువైట్ వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ కావడంతో వారు ఎయిర్ పోర్ట్ వద్ద ఆందోళనకు దిగారు.

Advertisement
Update: 2023-03-29 08:02 GMT

గన్నవరం విమానాశ్రయం ఎదుట 20మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. కువైట్ వెళ్లాల్సిన విమానం తమను వదిలేసి వెళ్లిందని వారు ఆరోపించారు. అయితే ఎయిర్ పోర్ట్ సిబ్బంది మాత్రం మీరే ఆలస్యంగా వచ్చారంటూ వారిని అడ్డుకున్నారు. ప్రయాణికుల ఆందోళనతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

అసలేం జరిగింది..?

గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి కువైట్‌ సమ్మర్‌ ఎయిర్‌ ఇండియా సర్వీస్‌ ఈరోజే ప్రారంభమైంది. అయితే తొలిరోజే కువైట్‌ సమ్మర్‌ సర్వీస్‌ ప్రయాణికులకు షాక్‌ ఇచ్చింది. ప్రయాణికులను వదిలేసి ముందే విమానం వెళ్లిపోవడంతో ఎయిర్‌ పోర్ట్‌ లో గందరగోళం నెలకొంది. వాస్తవానికి ఈ విమానం మధ్యాహ్నం 1.10కి డిపార్చర్ కావాల్సి ఉంది. కానీ ఉదయం 9.55 గంటలకు బయలుదేరింది. ఈ విషయంపై ముందుగానే ప్రయాణికులకు సమాచారమిచ్చామని మెసేజ్ లు పెట్టామని ఎయిర్ ఇండియా సిబ్బంది చెబుతున్నారు. కానీ అలాంటి మెసేజ్ లేవీ తమకు రాలేదంటున్నారు ప్రయాణికులు. మొత్తం 20మంది ఫ్లైట్ మిస్ అయ్యారు.

సహజంగా ప్రయాణికులు నేరుగా కాకుండా ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ట్రావెల్ ఏజెన్సీల వారు అడ్రస్, ఫోన్ నెంబర్ తమ ఆఫీస్ వి ఇస్తుంటారు. దీంతో ఆ మెసేజ్ ట్రావెల్ ఏజెన్సీలకు చేరినా, వారు ప్రయాణికులకు చేరవేయడంలో ఆలస్యం చేస్తే ఇలాగే ఫ్లైట్ మిస్ అవ్వాల్సిన పరిస్థితి. ఇటీవల ఇలాంటి ఉదాహరణలు చాలానే జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి. ఏకంగా 20మందికి కువైట్ వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ కావడంతో వారు ఎయిర్ పోర్ట్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

Tags:    
Advertisement

Similar News