పవన్ కు సిగ్నల్ ఇచ్చినట్లేనా..?

జనసేనకు మద్దతుగా కాపులను ఏకంచేసే పనిలో ఉన్నారు. ఈ విషయం గ్రహించిన జగన్మోహన్ రెడ్డి రెండోసభను దెందులూరులో నిర్వహించారు.

Advertisement
Update: 2024-02-04 05:53 GMT

దెందులూరులో శనివారం జరిగిన వైసీపీ బహిరంగసభ బాగా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. మొదటిసభ భీమిలిలో గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్న జోష్ వైసీపీ నేతల్లో బాగా కనబడుతోంది. అంతకు మించిన ఉత్సాహంతో దెందులూరు సభకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే.. ఉభయగోదావరి జిల్లాలకు కలిపి సిద్ధం సభను దెందులూరులో ఏర్పాటుచేశారు. ఉభయగోదావరి జిల్లాలు అంటేనే కాపుల ప్రాబల్యం ఉన్న జిల్లాలుగా బాగా ప్రచారంలో ఉన్నాయి. నిజానికి ఆ ప్రచారం అంత ఉత్తదే. ఎందుకంటే జనాభా రీత్యా ఉభయగోదావరి జిల్లాల్లో కాపుల ప్రాబ‌ల్యం ఎంతుందో బీసీలు, ఎస్సీ జ‌నాభా కూడా అంతే ఉంది.

కాకపోతే రెండుజిల్లాలు కాపుల జిల్లాలుగా పాపులరైపోయాయంతే. ఇపుడు విషయం ఏమిటంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ది పశ్చిమగోదావరి జిల్లా. పవన్ మొదటినుండి ఎక్కువగా ఆధారపడింది గోదావరి జిల్లాల మీదే. అయితే పవన్ కు ఊహించని రీతిలో ఈ జిల్లాల్లోనే 2019లో గట్టి దెబ్బపడింది. తాను పోటీచేసి ఓడిపోయిన రెండు నియోజకవర్గాల్లో ఒక‌టి భీమవరం పశ్చిమగోదావరిలోనే ఉంది. అందుకనే ఆ రిజల్టు మళ్ళీ రిపీట్ కాకూడదని రాబోయే ఎన్నికలకు కాస్త ముందునుండే జాగ్రత్తల తీసుకుంటున్నారు.

జనసేనకు మద్దతుగా కాపులను ఏకంచేసే పనిలో ఉన్నారు. ఈ విషయం గ్రహించిన జగన్మోహన్ రెడ్డి రెండోసభను దెందులూరులో నిర్వహించారు. బహిరంగసభను గ్రాండ్ సక్సెస్ చేసి పవన్ కు సవాలు విసిరినట్లుగా ఉంది. జిల్లాలోని కాపులు జనసేనకు ఏకపక్షంగా మద్దతుగా నిలవటంలేదన్న సిగ్నల్ ను పంపటమే జగన్ టార్గెట్ పార్టీలో టాక్ మొదలైంది.

గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల నుంచి దెందులూరు బహిరంగసభకు జనాలను తరలించారు. అందుకు తగ్గట్లే గడచిన 15 రోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు కలిసి పనిచేశారు. ఇప్పటివరకు పవన్ నిర్వహించిన వారాహి యాత్రలో జనాలు లోకల్ గా మాత్రమే హాజరయ్యారు. అదికూడా అంతంత మాత్రంగానే జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న `రా..కదలిరా` సభలకు జనాల స్పందన పెద్దగా కనబడటంలేదు. దెందులూరు సభ ఉభయగోదావరి జిల్లాల్లో తన పట్టుని వైసీపీ ప్రదర్శించటమే అని నేతలు చెబుతున్నారు. మరి జగన్ పంపిన సిగ్నల్ స్ట్రెంగ్త్ ఎంత బలంగా ఉందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News