ఉత్తరాంధ్ర సమస్యలపై 7న సదస్సు

ఈ సదస్సులో పాల్గొనేందుకు తెలుగుదేశం, జనసేన, సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్‌, లోక్‌సత్తా పార్టీలు సుముఖ‌త వ్య‌క్తం చేశాయ‌ని భీశెట్టి బాబ్జీ వివరించారు. ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్‌, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అధ్యక్షతన సదస్సు జ‌రుగుతుంద‌ని చెప్పారు.

Advertisement
Update: 2023-01-04 08:42 GMT

‘‘ఉత్తరాంధ్ర సమస్యలు, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షల’’ పై ఉత్తరాంధ్ర చర్చావేదిక ఆధ్వర్యంలో ఒక సదస్సును నిర్వహిస్తున్నట్లు చర్చావేదిక కో-కన్వీనర్‌ భీశెట్టి బాబ్జీ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 7వ తేదీన‌ ఉదయం 10.00 గంట‌ల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట‌ వరకు విశాఖపట్నంలోని దస్పల్లా హోటల్ స‌ద‌స్సు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సుకు అధికార వైఎస్‌ఆర్ సీపీతో సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మేధావులను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.

ఈ సదస్సులో పాల్గొనేందుకు తెలుగుదేశం, జనసేన, సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్‌, లోక్‌సత్తా పార్టీలు సుముఖ‌త వ్య‌క్తం చేశాయ‌ని భీశెట్టి బాబ్జీ వివరించారు. ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్‌, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అధ్యక్షతన సదస్సు జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డా.జయప్రకాష్‌ నారాయణ, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు, జనసేన పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఉత్తరాంధ్ర సిద్ధాంతకర్త ప్రొఫెస‌ర్ కె.ఎస్‌.చలం తదితరులు పాల్గొంటారని ఆయన వివరించారు. ఈ సదస్సుకు ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతిఒక్కరూ హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    
Advertisement

Similar News