కుప్పం ప్రజలు జగన్ ని గుర్తు పెట్టుకునేలా..

చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గ ప్రజలు జగన్ ని అభిమానిస్తే, ఆయన చేసిన మంచి పనుల్ని కొనియాడితే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం అదే పని చేస్తున్నారు సీఎం జగన్.

Advertisement
Update: 2024-02-26 04:34 GMT

పులివెందులకు జగన్ ఏం చేశారు..? అని ప్రశ్నించే చంద్రబాబు తాను సీఎంగా ఉన్నప్పుడు తన రాష్ట్రంలోనే ఉన్న పులివెందులను తానెందుకు పట్టించుకోలేదనే ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్పరు. కానీ జగన్ అలా కాదు, తన సొంత నియోజకవర్గం పులివెందులతోపాటు.. ఇటు చంద్రబాబు నియోజకవర్గం కుప్పం ప్రజలకు కూడా చిరకాలం గుర్తుండిపోయే పనులు చేస్తున్నారు. 2022లో కుప్పం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు జగన్. కుప్పం బ్రాంచ్ కెనాల్ ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. నేడు జాతికి అంకితం చేస్తున్నారు.

పులివెందుల నియోజకవర్గ ప్రజలు సీఎం జగన్ ని ఎంత పొగిడినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గ ప్రజలు జగన్ ని అభిమానిస్తే, ఆయన చేసిన మంచి పనుల్ని కొనియాడితే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం అదే పని చేస్తున్నారు సీఎం జగన్. పులివెందులతో పాటు, కుప్పంకి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నారు. బ్రాంచ్ కెనాల్ ని పూర్తి చేశారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ నీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. ఈ బ్రాంచ్‌ కెనాల్‌లో 68.466 కిలోమీటర్ వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి మద్దికుంటచెరువు, నాగసముద్రం చెరువు, మనేంద్రం చెరువు, తొట్లచెరువుకి సీఎం జగన్‌ కృష్ణాజలాలు విడుదల చేసి, ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత మిగతా 106 చెరువులకు కృష్ణాజలాలను విడుదల చేసి.. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేలా చేస్తారు. దీని ద్వారా దాదాపు 4 లక్షలమందికి తాగునీరు అందుతుంది.

ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు.. తన హయాంలో ఏమేం చేశారో చెప్పుకోవాలంటే తడబడాల్సిందే. కానీ జగన్ హయాంలో ఏమేం జరిగాయంటే నియోజకవర్గంలో ఎవర్ని అడిగినా చెబుతారు. సాగునీరు, తాగునీరు అందించి కుప్పం నియోజకవర్గానికి చిరకాలం గుర్తుండిపోతున్నారు సీఎం జగన్. 

Tags:    
Advertisement

Similar News