కూలిన మూడంత‌స్తుల భ‌వ‌నం.. ముగ్గురు మృతి.. - పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రిగిన కొద్ది గంట‌ల్లోనే విషాదం

ప్ర‌మాదంలో మృతిచెందిన అంజ‌లి పుట్టిన‌రోజు వేడుక‌లు బుధ‌వారమే జ‌రిగాయి. త‌న త‌ల్లిదండ్రులు రామారావు, క‌ల్యాణి, సోద‌రుడు దుర్గాప్ర‌సాద్‌తో క‌లిసి సంతోషంగా గ‌డిపిన కొద్ది గంట‌ల్లోనే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం శోచ‌నీయం.

Advertisement
Update: 2023-03-23 05:40 GMT

విశాఖ న‌గ‌రంలో ఘోరం చోటుచేసుకుంది. బుధ‌వారం అర్ధ‌రాత్రి మూడంత‌స్తుల భ‌వ‌నం నిట్ట‌నిలువునా కూలిపోయింది. ఘ‌ట‌నా స‌మ‌యంలో ఆ భ‌వ‌నంలో 8 మంది ఉన్నారు. వారిలో ముగ్గురు మృతిచెంద‌గా, మ‌రో ఐదుగురు తీవ్ర గాయాల‌పాలై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

విశాఖ క‌లెక్ట‌రేట్ స‌మీపంలోని రామ‌జోగిపేట‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బుధ‌వారం రాత్రే ఇద్ద‌రి మృత‌దేహాల‌ను గుర్తించ‌గా, మ‌రో వ్య‌క్తి మృత‌దేహాన్ని గురువారం ఉద‌యం రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. మృతుల్లో సాకేటి అంజ‌లి (14), ఆమె సోద‌రుడు దుర్గాప్ర‌సాద్ (17)తో పాటు బీహార్‌కు చెందిన చోటు (27) ఉన్నాడు.

వేడుకల ఆనందం మ‌రువ‌క‌ముందే..

ప్ర‌మాదంలో మృతిచెందిన అంజ‌లి పుట్టిన‌రోజు వేడుక‌లు బుధ‌వారమే జ‌రిగాయి. త‌న త‌ల్లిదండ్రులు రామారావు, క‌ల్యాణి, సోద‌రుడు దుర్గాప్ర‌సాద్‌తో క‌లిసి సంతోషంగా గ‌డిపిన కొద్ది గంట‌ల్లోనే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం శోచ‌నీయం. ఈ ఘ‌ట‌నలో రామారావు, క‌ల్యాణి కూడా తీవ్రంగా గాయ‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్ల‌లిద్ద‌రూ ప్ర‌మాదంలో శాశ్వ‌తంగా దూరమ‌వ‌డంతో త‌ల్లిదండ్రులిద్ద‌రూ క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు.

గాయ‌ప‌డిన‌వారిలో కొమ్మిశెట్టి శివ‌శంక‌ర‌, సున్న‌పు కృష్ణ‌, సాతిక రోజారాణి కూడా ఉన్నారు. వారు కూడా కేజీహెచ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఘ‌ట‌నాస్థ‌లాన్ని డీసీపీ సుమిత్ గ‌రుడ ప‌రిశీలించారు.

Tags:    
Advertisement

Similar News