జగన్ నన్ను పశుపతి అన్నాడు.. మంచిదే

పశుపతి పోలిక చంద్రబాబుకి ఎందుకో బాగా కనెక్ట్ అయినట్టుంది. అందుకే తనని తాను శివుడిగా పోల్చుకుంటూ బిల్డప్ ఇస్తున్నారు బాబు.

Advertisement
Update: 2024-04-03 14:05 GMT

సీఎం జగన్ చేస్తున్న విమర్శలను చంద్రబాబు మరీ ఇంత పర్సనల్ గా తీసుకుంటారా అనిపించే సందర్భం ఇది. తనను జగన్ పశుపతి అన్నారని, అయినా తనకేం పర్వాలేదని, అది తిట్టు కాదని, పెద్ద పొగడ్త అని కవర్ చేసుకున్నారు చంద్రబాబు. "ఇటీవల జగన్‌ మాట్లాడుతూ.. నన్ను పశుపతి అని విమర్శించారు. దానికి అర్థం ప్రపంచాన్ని కాపాడే శివుడు. అందుకే నేను శివుడి అవతారమెత్తాను. విషాన్ని గొంతులో పెట్టుకొని శివుడు ప్రపంచాన్ని కాపాడితే.. నన్ను, నా కుటుంబాన్ని, పవన్‌ కల్యాణ్‌ను ఎంత ఇబ్బంది పెట్టినా, వేధించినా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి భరించాం." అంటూ కోనసీమ జిల్లా కొత్తపేటలో తనకు తాను సెల్ఫ్ డబ్బా వేసుకున్నారు బాబు.


Full View


మరి చంద్రముఖి సంగతేంటి..?

పెద్ద పప్పు, చిన్నపప్పు, తుప్పు.. అంటూ వైసీపీ మంత్రులు చంద్రబాబుని, లోకేష్ ని విమర్శిస్తుంటారు. సీఎం జగన్ మాత్రం విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తిగా చంద్రబాబుని అభివర్ణిస్తుంటారు. ఇటీవల మేమంతా సిద్ధం సభల్లో చంద్రబాబుని పశుపతి, చంద్రముఖి అంటూ సెటైర్లు పేలుస్తున్నారు జగన్. అరుంధతి సినిమాలో పశుపతిని బంధించి తాళం వేసినట్టు.. ఈ ఎన్నికల్లో చంద్రబాబు పీడ శాశ్వతంగా విరగడయ్యేలా ప్రజలు ఓటుతో బదులివ్వాలని అంటున్నారు. అయితే ఈ పశుపతి పోలిక చంద్రబాబుకి ఎందుకో బాగా కనెక్ట్ అయినట్టుంది. అందుకే తనని తాను శివుడిగా పోల్చుకుంటూ బిల్డప్ ఇస్తున్నారు బాబు.

ఇంద్రుడు.. చంద్రుడు

గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని విషయంలో కూడా తనని తాను ఇంద్రుడిగా పోల్చుకుని ఓవర్ యాక్షన్ చేశారు చంద్రబాబు. ఆయనకు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా వంత పాడింది. సీన్ కట్ చేస్తే.. ఆ ఇంద్రుడి కుర్చీని లాగిపడేశారు ప్రజలు. ఈసారి మరింత గట్టిగా సమాధానం చెప్పబోతున్నారు. మరి ఈసారి పశుపతికి ఎలాంటి ట్రీట్ మెంట్ ఇస్తారో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News