అప్పుడే చేతులెత్తేసిన చంద్రబాబు..?

మేం గెలిచి తీరుతామని ప‌దేప‌దే గంభీరంగా చెప్పుకునే పలికే చంద్రబాబు, 2024 ఎన్నిక‌ల్లో ప్రజలు తిరస్కరిస్తారని తెలియడం వల్లనే ఆ మాట అన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
Update: 2024-02-01 08:27 GMT

ఎన్నిక‌ల ముందే టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతులెత్తేసినట్లే కనిపిస్తున్నారు. తాను ఓడిపోవడం ఖాయమని తెలుసుకున్న ఆయన, చివరి అస్త్రం వదిలినట్లు అనిపిస్తోంది. ఎన్నికల్లో ఈసారి ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బాబు స్ప‌ష్టంగా చెప్పేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయం చెప్పారు. ఓడిపోవడం ఖాయమని గుర్తించి చివరి అస్త్రంగా ప్రజల సానుభూతి పొందడానికి చంద్ర‌బాబు ఇలా మాట్లాడినట్లు భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, తిరిగి వైఎస్సార్ సీపీ గెలుస్తుందని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లు అయింది. పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేనతో పొత్తు పెట్టుకున్నా టిడిపిని గెలిపించలేమనే నిర్ధారణకు చంద్రబాబు వచ్చారని అనుకోవాల్సి వస్తోంది.

మేం గెలిచి తీరుతామని ప‌దేప‌దే గంభీరంగా చెప్పుకునే పలికే చంద్రబాబు, 2024 ఎన్నిక‌ల్లో ప్రజలు తిరస్కరిస్తారని తెలియడం వల్లనే ఆ మాట అన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని నెటిజన్లు ట్వీట్లు చేయడం అప్పుడే ప్రారంభమైంది, చంద్రబాబు మాట్లాడిన వీడియోను పోస్టు చేసి నెటిజన్లు కామెంట్స్‌ పోస్టు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News