ఈనెల 17న గుంటూరులో బీఆర్ఎస్ ఆత్మీయ సదస్సు

BRS Meeting in Andhra Pradesh: దేశంలో అత్యధికంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం కేవలం తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని చెప్పారు మాజీ మంత్రి రావెల. ఏపీలో వైసీపీకి, టీడీపీకి ప్రత్యామ్నాయం కావాలని ప్రజలు ఆశిస్తున్నారని. ఆ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.

Advertisement
Update: 2023-02-03 11:54 GMT

బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ సభలు, సమావేశాలు జోరందుకుంటున్నాయి. ముందుగా ఏపీలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని కూడా ప్రకటించిన తర్వాత ఇక్కడ కార్యకలాపాలు స్పీడవుతున్నాయి. కేసీఆర్ ఆధ్వర్యంలో త్వరలో ఏపీలో భారీ బహిరంగ సభకు సన్నాహాలు జరుగుతున్నయి. విశాఖ వేదికగా ఈ సభను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అయితే అంతకు ముందే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు నేతలు.


బీఆర్ఎస్ లో చేరిన తర్వాత మొదటిసారి గుంటూరుకి వచ్చిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈనెల 17న గుంటూరులో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

దేశంలో అత్యధికంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం కేవలం తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని చెప్పారు మాజీ మంత్రి రావెల. ఏపీలో వైసీపీకి, టీడీపీకి ప్రత్యామ్నాయం కావాలని ప్రజలు ఆశిస్తున్నారని. ఆ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ కి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలని, ఎలాంటి నాయకత్వం కావాలో వారే నిర్ణయించుకుంటారని చెప్పారు.

ఏపీలో బీఆర్ఎస్ బలమెంత..?

ఏపీలో తోట చంద్రశేఖర్ రావు, రావెల కిషోర్ బాబు సహా.. పలువుకు కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలపరిచేందుకు కష్టపడుతున్నారు. అదే సమయంలో వివిధ పార్టీల్లోని అసంతృప్తులను బీఆర్ఎస్ ఆకర్షిస్తోంది. ముందుగా పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యం ఉంటుందనే భావనతో కొంతమంది ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారు.

కీలక నేతలు కొంతమంది సరిగ్గా ఎన్నికల టైమ్ లో బీఆర్ఎస్ లో చేరే అవకాశముందని చెబుతున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నుంచి నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. జయాపజయాల సంగతి పక్కనపెడితే.. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్లను చీల్చే అవకాశం కూడా ఉంది. బలమైన నాయకత్వం ఉంటే కనీసం ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో అయినా గట్టిపోటీ ఇచ్చే అవకాశముంది.

Tags:    
Advertisement

Similar News