లోక్‌సభలో రఘురామ వర్సెస్ భరత్‌

సిట్‌ డౌన్‌ అంటూ రఘురామ గట్టిగా అరిచారు. అందుకు భరత్ అంతే తీవ్రంగా స్పందించారు. షటప్ అంటూ ఎదురుదాడి చేశారు. తనపై అరిచే అధికారం రఘురామకు ఎక్కడుందని ప్రశ్నించారు.

Advertisement
Update: 2022-07-21 12:53 GMT

లోక్‌సభలో మరోసారి ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ ఎంపీలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒకదశలో రఘురామ, ఎంపీ మార్గాని భరత్ పరస్పరం దూషించుకున్నారు. ఏపీ అక్రమ మార్గాల్లో అప్పులు తెస్తోందని రఘురామ ఆరోపించడంతో వివాదం మొదలైంది.

నేరుగా రాష్ట్ర ఖజానాకు రావాల్సిన మద్యం ఆదాయాన్ని బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి, ఆ ఆదాయాన్ని గ్యారెంటీగా చూపించి అప్పులు తెస్తున్నారని.. ఇది రాజ్యాంగ విరుద్దమంటూ రఘురామ మాట్లాడారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న ఎంపీ భరత్.. ఆధారాలు, అవగాహన లేకుండా మాట్లాడొద్దు అంటూ అడ్డుపట్టారు. దాంతో సిట్‌ డౌన్‌ అంటూ రఘురామ గట్టిగా అరిచారు. అందుకు భరత్ అంతే తీవ్రంగా స్పందించారు.

షటప్ అంటూ ఎదురుదాడి చేశారు. తనపై అరిచే అధికారం రఘురామకు ఎక్కడుందని ప్రశ్నించారు. స్పీకర్‌ పదేపదే విజ్ఞప్తి చేసినా రఘురామ మాట్లాడే వరకు ఎంపీల మధ్య వాగ్వాదం నడిచింది. స్పీకర్‌ గట్టిగా హెచ్చరించడంతో తాను ఇతర ఎంపీల వైపు చూడకుండా మీవైపేచూసి మాట్లాడుతా అంటూ రఘురామకృష్ణంరాజు చేయిని చెంపకు అడ్డుపెట్టుకుని ప్రసంగించారు.

Tags:    
Advertisement

Similar News