పవన్‌కు అభివృద్ధి అంటే ఏంటో తెలుసా?.. - ఏపీ ఇంటెలెక్చువల్స్, సిటిజన్స్‌ ఫోరం అధ్యక్షుడు విజయబాబు

ఎన్నికలు సమీపిస్తున్నప్పుడైనా పవన్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని విజయబాబు సూచించారు. కానీ, అతని వ్యాఖ్యలు రాజకీయాలపై అతని అవగాహనా రాహిత్యాన్ని, డొల్లతనాన్ని బయటపెడుతున్నాయని ఎద్దేవా చేశారు.

Advertisement
Update: 2024-02-23 06:37 GMT

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై ఏపీ ఇంటెలెక్చువల్స్, సిటిజన్స్‌ ఫోరం అధ్యక్షుడు విజయబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌కి అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. దోచుకుని సింగపూర్‌లో దాచుకోవడమేనా అభివృద్ధి అంటే అని నిలదీశారు. విజయవాడలోని ఏపీఐసీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలు సమీపిస్తున్నప్పుడైనా పవన్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని విజయబాబు సూచించారు. కానీ, అతని వ్యాఖ్యలు రాజకీయాలపై అతని అవగాహనా రాహిత్యాన్ని, డొల్లతనాన్ని బయటపెడుతున్నాయని ఎద్దేవా చేశారు. కోవిడ్‌ ప్రభావం ఉన్న రెండేళ్లూ మినహాయిస్తే.. జగన్‌ చేసిన అప్పుల శాతం ఎంత, గత ప్రభుత్వంలో టీడీపీ చేసిన అప్పుల శాతం ఎంత అనేది బేరీజు వేసుకుంటే టీడీపీ చేసిన అప్పులే ఎక్కువని సాక్షాత్తూ కాగ్, ఫైనాన్స్‌ కమిషన్‌ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఆ రిపోర్టులను పవన్‌ కల్యాణ్‌ చదువుకుంటే మంచిదన్నారు. కాపీలు ఆయన వద్ద లేకపోతే తాను పంపుతానని విజయబాబు చెప్పారు.

రాష్ట్ర విభజన నాటికి మిగులు రెవెన్యూలో ఉన్న ఏపీ.. బాబు అధికారంలోకి వచ్చాక పతనమైందని విజయబాబు గుర్తుచేశారు. జగన్‌ ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే చంద్రబాబు మిగిల్చారని వివరించారు. బాబు సీఎం కాక ముందు మొత్తం అప్పు రూ.1.53 లక్షల కోట్లు కాగా, ఆయన దిగిపోయే నాటికి దానిని రూ.4.12 లక్షల కోట్లు చేశారని విజయబాబు వెల్లడించారు. అయినా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన నువ్వెక్కడ.. 151 స్థానాలు సాధించిన జగన్‌ ఎక్కడ అని ఆయన నిలదీశారు. సిద్ధం అంటే యుద్ధం అంటామంటున్న పవన్‌ అసలు తాను ఈసారి ఎన్నికల్లో ఏ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడో ముందు తేల్చుకుని దానికి సిద్ధమవ్వాలని విజయబాబు హితవు పలికారు.

Tags:    
Advertisement

Similar News