హర్షకుమార్ వైసీపీలో చేరుతున్నారా?

ఈ ప్రచారానికి కారణం ఏమిటంటే జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ జీవీతో భేటీ అవ్వటమే. మామూలుగా అయితే వీళ్ళిద్దరి దారులు వేర్వేరు. అలాంటిది జీవీతో పిల్లి భేటీ అయ్యారంటేనే కచ్చితంగా రాజకీయ చర్చలే అయ్యుంటాయనే ప్రచారం పెరిగిపోతోంది.

Advertisement
Update: 2022-12-06 05:53 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ వైసీపీలో చేరుతున్నారా? సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా అధికారపార్టీ వైసీపీకి చెందిన సోషల్ మీడియాలో ఈ విషయమై మిశ్రమ స్పందన కనబడుతోంది. జీవీ హర్షకుమార్ ఎస్సీ లోక్‌సభ నియోజకవర్గం అమలాపురం నుంచి 2004,2009 ఎన్నికల్లో గెలిచారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పుడు హర్షకుమార్ జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేస్తే 9931 ఓట్లొచ్చాయి.

అప్పటి నుండి కొంతకాలం యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉండి తర్వాత మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఎప్పుడైతే యాక్టివ్ అయ్యారో అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తునే ఉన్నారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి మరింత దూకుడుగా మాట్లాడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి అంటే లోకల్‌గా జరిగే ఘటనలకు కూడా డైరెక్టుగా జగన్నే నిందిస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలోనే హఠాత్తుగా కాంగ్రెస్‌కు జీవీ రాజీనామా చేసి తొందరలోనే వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం మొదలైంది.

ఈ ప్రచారానికి కారణం ఏమిటంటే జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ జీవీతో భేటీ అవ్వటమే. మామూలుగా అయితే వీళ్ళిద్దరి దారులు వేర్వేరు. అలాంటిది జీవీతో పిల్లి భేటీ అయ్యారంటేనే కచ్చితంగా రాజకీయ చర్చలే అయ్యుంటాయనే ప్రచారం పెరిగిపోతోంది. వీళ్ళిద్దరి మధ్య రాజకీయ చర్చలేముంటాయి?

హర్షను వైసీపీలోకి ఆహ్వానించటం మినహా పిల్లికి వేరే అవసరమేమీలేదనే అభిప్రాయాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంపైనే సోషల్ మీడియాలో మిశ్రమ స్పంద‌న‌ కనబడుతోంది. కొంతమందేమో వైసీపీలో జీవీ చేరుతారన్న విషయమై తీవ్రంగా విభేదిస్తున్నారు. ఇంతకాలం తిట్టిన హర్షాను జగన్ ఎలా చేర్చుకుంటారని నెటిజన్లు నిలదీస్తున్నారు. మరికొందరేమో వైసీపీకి బ్యాడ్ టైమ్ స్టార్టయ్యిందంటున్నారు. కొంతమందేమో జగన్ నిర్ణయం మంచిదే అని అభినందిస్తున్నారు. మొత్తానికి వైసీపీలో జీవీ చేరుతారనే ప్రచారంపై నెగిటివ్ స్పందనలే ఎక్కువగా కనబడుతున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News