అచ్చి, బుచ్చి, బోడి.. అందరికీ ఇదే మా హెచ్చరిక..

అచ్చి, బుచ్చి, బోడి.. అందరూ వచ్చే ఎన్నికల్లో నట్టేట మునిగిపోతారని అన్నారు మంత్రి జోగి రమేష్.

Advertisement
Update: 2022-08-28 10:43 GMT

అచ్చి, బుచ్చి, బోడి.. అందరూ వచ్చే ఎన్నికల్లో నట్టేట మునిగిపోతారని అన్నారు మంత్రి జోగి రమేష్. తండ్రీ, కొడుకుల్ని నమ్ముకుంటే అంతే సంగతులని అన్నారు. ఇప్పుడే వారు భవిష్యత్ గురించి ఆలోచించుకోవాలని హెచ్చరించారు. ప్రజలు.. పార్టీలు, కులాలు, మతాలు చూడం లేదని, కేవలం జగన్ ని మాత్రమే చూస్తున్నారని అన్నారు జోగి రమేష్.

కుప్పం జస్ట్ ట్రైలర్ మాత్రమే..

టీడీపీ మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైందనడానికి నిదర్శనం కుప్పం అని చెప్పారు జోగి రమేష్. టీడీపీ జెండాను, పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించడానికి ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. కుప్పంలో మొదలైన తిరుగుబాటు 175 నియోజకవర్గాల్లోనూ వస్తుందని, ఏ నియోజకవర్గంలోనూ టీడీపీ నేతలు బయట తిరిగే పరిస్థితి ఉండదని అన్నారు. ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని, 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు మాకు ఏం చేశాడంటూ కుప్పంలో ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఆ తిరుగుబాటు కుప్పంలో బీసీల నుంచే ప్రారంభం అయిందని చెప్పారు. వాడుకుని వదిలేశారని బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు, మహిళలు అందరూ తిరుగుబాటు చేశారన్నారు.

అన్నక్యాంటీన్లో ఎంతమంది తిన్నారు..?

మూడేళ్లలో జగన్ ప్రతి ఇంటి గడప వద్దకు సంక్షేమ పథకాలు అందజేశారని, ఇది ప్రజలు చెప్తున్న మాట అని అన్నారు మంత్రి జోగి రమేష్. అధికారంలో ఉన్నప్పుడు మూడు సార్లు కూడా కుప్పం వెళ్లని చంద్రబాబు.. ఇప్పుడు పదే పదే కుప్పం చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ ఎన్ని అన్న క్యాంటీన్ లు పెట్టిందని, ఎంతమందికి భోజనం పెట్టిందని నిలదీశారు. ప్రజల్ని ఓటు అడిగే హక్కు చంద్రబాబుకి, ఆ పార్టీ నాయకులకు లేదన్నారు. సొంత నియోజకవర్గాన్నే అభివృద్ధి చేయలేని చంద్రబాబు, ఇక రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు కుప్పం చంద్రబాబు గడ్డ కాదని, అది వైసీపీ అడ్డా అని అన్నారు.

పాల్, పవన్ ఇద్దరూ ఒకటే..

కేఏ పాల్‌ కి, పవన్ పాల్‌ కి తేడా లేదని, ఇద్దరికీ ఆంధ్రప్రదేశ్‌ లో సీట్లు లేవు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి జోగి రమేష్. జాకీలు పెట్టి లేపినా లేవలేని చంద్రబాబుని పవన్ కల్యాణ్ మోయగలరా అని ప్రశ్నించారు. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, వ్యతిరేక ఓట్లు ఉన్నాయని చెబుతున్న పవన్ కల్యాణ్, 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. పొత్తులతో పొర్లాడటమే పనిగా పెట్టుకున్న పవన్, ప్రజలకు ఏం చేశారని నిలదీశారు.

Tags:    
Advertisement

Similar News