అవును, పటన్ చెరు కోడిపందాల్లో పాల్గొన్నాను, అది నా వ్యసనం -టీడీపీ నేత చింతమనేని

హైదరాబాద్ శివారుల్లోని పటాన్ చెరు లో నిర్వహించిన కోడిపందేల్లో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నాడని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు వస్తున్నారని తెలిసి చింతమనేని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారు. ఆయన కోసం గాలిస్తున్నామని పోలీసులు ప్రకటించారు. అయితే నిన్న‌, తాను కోడిపందేల్లో పాల్గొనలేదని, అసలు పటన్ చెరు ప్రాంతానికే రాలేదని బుకాయించిన ప్రభాకర్ ఇప్పుడు మాట మార్చారు. తాను పటన్ చెరు లో జరిగిన కోడిపందాల్లో పాల్గొన్నానని […]

Advertisement
Update: 2022-07-08 04:10 GMT

హైదరాబాద్ శివారుల్లోని పటాన్ చెరు లో నిర్వహించిన కోడిపందేల్లో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నాడని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు వస్తున్నారని తెలిసి చింతమనేని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారు. ఆయన కోసం గాలిస్తున్నామని పోలీసులు ప్రకటించారు.

అయితే నిన్న‌, తాను కోడిపందేల్లో పాల్గొనలేదని, అసలు పటన్ చెరు ప్రాంతానికే రాలేదని బుకాయించిన ప్రభాకర్ ఇప్పుడు మాట మార్చారు. తాను పటన్ చెరు లో జరిగిన కోడిపందాల్లో పాల్గొన్నానని అక్కడే కాదు తాను కోడిపందేల కోసం కర్నాటకకు కూడా వెళ్ళానని వెల్లడించారు చింతమనేని.

తాను కోడిపందాలు ఆడుతానని రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసునని, పోలీసులకు కూడా తెలుసునని, ఇది చాలా మామూలు విషయమని ఆయన అన్నారు.కోడిపందేలు ఆడటం తనకు ఒక వ్యసనమని చెప్పిన ప్రభాకర్ ”నేను కోడిపందేలు ఆడటానికే పటాన్ చెరు వెళ్ళాను.అయితే కోడిపందేలు చట్టం దృష్టిలో నేరం కాబట్టి… పోలీసులు వస్తున్నారని సమాచారం అందగానే అక్కడి నుంచి క్షేమంగా తప్పుకున్నాను” అని పేర్కొన్నారు.

అయితే ఇదంతా కుట్రగా చింతమనేని అభివర్ణించారు. కర్ణాటకలో కోడిపందేలకు వెళ్లి వస్తుండగా, భోజనానికి పిలిచారని… తనను ఇరికించడానికి ఇంత పెద్ద స్కెచ్ వేశారని చింతమనేని మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News