అమెరికాలో 300 కోట్ల మోసానికి పాల్ప‌డ్డ భారతీయిడి అరెస్ట్!

10,000 కంటే ఎక్కువ మందిని 300 కోట్ల రూపాయల మేర మోసగించిన భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలో అరెస్టయ్యాడు. నెవాడాలోని లాస్ వెగాస్‌కు చెందిన నీల్ చంద్రన్‌ను లాస్ ఏంజెల్స్‌లో బుధవారం అరెస్టు చేసినట్లు న్యాయ శాఖ తెలిపింది. పోలీసుల సమాచారం ప్రకారం నీల్ చంద్రన్ ‘ViRSE’ అనే బ్యానర్‌తో ఓ ఇన్వేస్ట్‌మెంట్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ కంపెనీకి అనుబంధంగా Free Vi Lab, Studio Vi Inc., ViDelivery Inc, ViMarket Inc, Skalex […]

Advertisement
Update: 2022-07-01 04:02 GMT

10,000 కంటే ఎక్కువ మందిని 300 కోట్ల రూపాయల మేర మోసగించిన భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలో అరెస్టయ్యాడు. నెవాడాలోని లాస్ వెగాస్‌కు చెందిన నీల్ చంద్రన్‌ను లాస్ ఏంజెల్స్‌లో బుధవారం అరెస్టు చేసినట్లు న్యాయ శాఖ తెలిపింది.

పోలీసుల సమాచారం ప్రకారం నీల్ చంద్రన్ ‘ViRSE’ అనే బ్యానర్‌తో ఓ ఇన్వేస్ట్‌మెంట్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ కంపెనీకి అనుబంధంగా Free Vi Lab, Studio Vi Inc., ViDelivery Inc, ViMarket Inc, Skalex USA Inc వంటి మరి కొన్ని ఫేక్ కంపెనీలు నడిపిస్తున్నట్లు కోర్టు విచారణలో తేలింది.తన కంపెనీలో పెట్టుబడి దారులకు ఎక్కువ ఆదాయం ఆశ చూపి ఆయన కోట్ల రూపాయలు వసూలు చేశాడు.

తమ కంపెనీకి అత్యంత సంపన్నులైన వినియోగదారులున్నారనే తప్పుడు సమాచారంతో పెట్టుబడిదారులను ఆకర్షించాడు. ఈ కంపెనీలు సంపన్న కొనుగొలుదారుల కన్సార్టియం ద్వారా కొనగోలు చేయబడుతున్నాయంటూ తప్పుడు సాక్ష్యాలు చూపించాడు. దాంతో పది వేలకు పైగా జనం ఇందులో పెట్టుబడులు పెట్టారు.

అయితే నిజానికి ఇందులో సంపన్న కొనుగోలుదారులు ఒక్కరూ లేరు. నీల్ చంద్రన్ పత్రాలలో మాత్రమే అలాంటి కొనుగోలుదారులను సృష్టించాడు. సంపన్న కొనుగోలుదారులు ఉంటేనే ఈ కంపెనీకి లాభాలు వస్తాయి. పైగా చంద్రన్ వ్యక్తిగత ప్రయోజనం కోసం నిధులలో గణనీయమైన భాగం దుర్వినియోగం చేయబడింది. ఇలా లేని కొనుగోలు దారులను చూపించి మోసం చేసినందుకు, అక్రమ నగదు లావాదేవీలు నిర్వహించినందుకు అతనిపై కేసులు నమోదు చేశారు.

మరో వైపు చంద్రన్‌కు చెందిన‌ 39 టెస్లా వాహనాలు, 100 వేర్వేరు ఆస్తులు, ఇతర రియల్ ఎస్టేట్ ఆస్తులు జప్తు చేయాల్సిందిగా కోర్టు అధికారులను ఆదేశించింది.

కాగా నీల్ చంద్రన్ పై అభియోగాలు రుజువైతే మూడు ఫ్రాడ్‌ కేసుల్లో ఒక్కొక్క కేసుకి 20 ఏళ్లు చొప్పున, అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించిన రెండు కేసుల్లో ఒక్కొక్క కేసుకి 10 ఏళ్లు చొప్పున జైలు శిక్ష పడుతుంది.

 

Tags:    
Advertisement

Similar News