అధిక బరువు తగ్గేందుకు.. ఆరోగ్యాన్ని పెంచేందుకు గ్రీన్ టీ..

Green tea for weight loss: ఆరోగ్యానికి గ్రీన్ టీ.. ప్రస్తుతం గ్రీన్ టీ వాడకం చాలామందికి దినచర్యలో ఓ భాగమైపోయింది. రోజువారి ఆహారంలో తప్పకుండా గ్రీన్ టీని తీసుకోవడానికి ఆశక్తిని చూపుతున్నారు.

Advertisement
Update: 2022-12-29 05:30 GMT

Green tea for weight loss: అధిక బరువు తగ్గేందుకు.. ఆరోగ్యాన్ని పెంచేందుకు గ్రీన్ టీ..

ఆరోగ్యానికి గ్రీన్ టీ..


ప్రస్తుతం గ్రీన్ టీ వాడకం చాలామందికి దినచర్యలో ఓ భాగమైపోయింది. రోజువారి ఆహారంలో తప్పకుండా గ్రీన్ టీని తీసుకోవడానికి ఆశక్తిని చూపుతున్నారు. ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా ఊబకాయాన్ని అదుపులో ఉంచుతుందని నమ్మేవారూ ఉన్నారు. అయితే అసలు గ్రీన్ టీ మన శరీరానికి ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగాలను కలుగజేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం.

కరోనాకు ముందు నుంచే గ్రీన్ టీ వాడకం జనాల్లో ఎక్కువగా ఉంది దీనికి ప్రధాన కారణం బరువు.. బరువు తగ్గాలనుకునే వారు గ్రీన్ టీలో కాసింత నిమ్మకాయ రసం.. దానితో పాటు తేనెను కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారని.. ఫిట్ గా ఉంటారని నమ్మకమే గ్రీన్ టీ వాడకం పెరగడానికి ప్రధాన కారణం.


గ్రీన్ టీ ఉపయోగాలు..



గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్లే హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. ఇవి శరీరానికి అయ్యే రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తాయి. బరువు తగ్గేవారిలో గ్రీన్ టీ చాలా వరకూ సపోర్ట్ ఇస్తుంది. శరీరాన్ని తేలికగా మారుస్తూ..కొలస్ట్రాల్ తగ్గించేందుకు సహాయపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ తాగడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వకుండా చూస్తాయి.


మెదడును ఎక్టివ్ గా ఉంచుతూ..జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది. అలాగే అల్జేమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చే రిస్క్ ను కూడా తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో ఉంచడంతో పాటుగా టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ ను కూడా తగ్గిస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. మొత్తం మీద గ్రీన్ టీ వాడకం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు నూతన ఉత్సాహాన్ని కూడా ఇస్తుందనేది పరిశోధకుల మాట.. నోటి దుర్వాసనను, దంతక్షయాన్ని కంట్రోల్ లో ఉంచి..ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మాన్ని మెరుగ్గా ఉంచడంలో కూడా గ్రీన్ టీ సహకరిస్తుంది.


గ్రీన్ టీని రోజులో ఎన్నిసార్లు తీసుకోవాలి..



ఆరోగ్యాన్ని సమతులం చేసే ఈ గ్రీన్ టీని రోజులో ఎన్నిసార్లు తీసుకోవాలి అనే విషయంలో చాలామందిలో అనుమానాలు లేకపోలేదు. గ్రీన్ టీ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోలేదు.

అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా గ్రీన్ టీని తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. పరిమిత మోతాదులో మాత్రమే అంటే రోజులో ఒకటి లేదా రెండు కప్పులుగా మాత్రమే గ్రీన్ టీని తీసుకోవాలని ప్రేగు సిండ్రోమ్ (IBS) ఉన్నవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలని డాక్టర్స్ సూచిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News