చాలా రోజుల తర్వాత రాజ్ భవన్ కు కేసీఆర్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ల మధ్య కొంత కాలంగా యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాలను గవర్నర్ వ్యతిరేకించడం, రాష్ట్ర పాలనలో గవర్నర్ అనవసర జోక్యం చేసుకోవడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగ ప్ర‌కటనలు చేయడం తదితర అంశాల పట్ల కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. దాంతో చాలా కాలంగా ఆయన రాజ్ భవన్ కు వెళ్ళిన దాఖలాలే లేవు. గతేడాది అక్టోబరు 11న చివరిసారి అప్పటి హైకోర్టు ప్రధాన […]

Advertisement
Update: 2022-06-27 21:00 GMT

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ల మధ్య కొంత కాలంగా యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాలను గవర్నర్ వ్యతిరేకించడం, రాష్ట్ర పాలనలో గవర్నర్ అనవసర జోక్యం చేసుకోవడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగ ప్ర‌కటనలు చేయడం తదితర అంశాల పట్ల కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు.

దాంతో చాలా కాలంగా ఆయన రాజ్ భవన్ కు వెళ్ళిన దాఖలాలే లేవు. గతేడాది అక్టోబరు 11న చివరిసారి అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్ళారు.

అయితే ఇంత కాలానికి ఈ రోజు కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్తున్నట్టు సమాచారం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఉదయం 10.05 గంటలకు గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణస్వీకారం చేయిస్తారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు హాజరవుతారని తెలుస్తోంది. ఉప్పు, నిప్పుగా ఉన్న గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్నాళ్ళకు ఒకే వేదికపై కనిపించనున్నారు.

Tags:    
Advertisement

Similar News