ప్రగతి భవన్ కు పాదయాత్రపై పోలీసుల దండయాత్ర‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామన్నగూడెం గ్రామంలోని భూ సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు గ్రామస్తులు చేపట్టిన ‘ప్రగతి‌భవన్‌కు పాదయాత్ర’ను భగ్నం చేసేందుకు పోలీసులు ఆదివారం అర్ధరాత్రి గ్రామాన్ని చుట్టుముట్టారు. పాదయాత్రకు సారథ్యం వహిస్తున్న గ్రామ సర్పంచ్ దంపతులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. సర్పంచ్ భర్త మడకం నాగేశ్వరరావు ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. సర్పంచ్ మడకం స్వరూపతో పాటు కొందరు గ్రామస్తులను అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సర్పంచ్‌ స్వరూపను […]

Advertisement
Update: 2022-06-27 03:28 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామన్నగూడెం గ్రామంలోని భూ సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు గ్రామస్తులు చేపట్టిన ‘ప్రగతి‌భవన్‌కు పాదయాత్ర’ను భగ్నం చేసేందుకు పోలీసులు ఆదివారం అర్ధరాత్రి గ్రామాన్ని చుట్టుముట్టారు. పాదయాత్రకు సారథ్యం వహిస్తున్న గ్రామ సర్పంచ్ దంపతులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. సర్పంచ్ భర్త మడకం నాగేశ్వరరావు ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. సర్పంచ్ మడకం స్వరూపతో పాటు కొందరు గ్రామస్తులను అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సర్పంచ్‌ స్వరూపను ఈ ఉదయం 7:30 గంటలకు విడిచిపెట్టారు. దీంతో గ్రామస్తులు పాదయాత్ర చేపట్టారు. వీరంతా వాగొడ్డిగూడెం వద్దకు చేరుకోగానే.. భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో గిరిజనులు, పోలీసుల మధ్య రణరంగాన్ని తలపించేలా ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి గిరిజనులను చెదరగొట్టారు.

ఇళ్లల్లోకి చొరబడ్డారు..

సోమవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో రామన్నగూడెం గ్రామంలో పోలీసులు బీభత్సం సృష్టించారని, ఇళ్లలోకి చొరబడి దౌర్జన్యంగా తమ వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారని గిరిజనులు ఆరోపించారు. సర్పంచ్ స్వరూప‌ ఏడాది వయసున్న పాపను కూడా పోలీస్ స్టేషన్‌కు తరలించడం దారుణమన్నారు.

తమ గ్రామంలో భూసమస్యలను పరిష్కరించుకునేందుకు శాంతియుతంగా పాదయాత్ర చేపడుతున్నట్లు అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు లిఖితపూర్వకంగా తెలియజేసినప్పటికీ పోలీసులను ఉసిగొలిపి తమపై దౌర్జన్యానికి పాల్పడి పాదయాత్రను భగ్నం చేసేందుకు ప్రయత్నించడం సబబు కాదన్నారు.

ALSO READ: ‘టిఆర్ఎస్ లో చీలిక’ ఒక మిథ్య !

Tags:    
Advertisement

Similar News