బెంగాల్ లో రెండోరోజు కొనసాగుతున్న హింస… బీజేపీపై మమత ఆగ్రహం

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిన్న దేశవ్యాప్తంగా నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. పలు చోట్ల ఆ నిరసనల్లో హింస‌ కూడా చెలరేగింది. బెంగాల్ లో ఆ నిరసనలు, హింస ఇవ్వాళ్ళ కూడా కొనసాగింది. శనివారంనాడు హౌరాలో కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు అనేక వాహనాలకు, పలు భవనాలకు నిప్పు పెట్టారు. హౌరాలోని పంచ్లా ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పింది. నిరసనకారులకు పోలీసులకు మధ్య యుద్దవాతావరణమే నెలకొంది. నిరసనకారులు పోలీసులపై రాళ్ళతో దాడి చేయగా , […]

Advertisement
Update: 2022-06-11 05:17 GMT

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిన్న దేశవ్యాప్తంగా నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. పలు చోట్ల ఆ నిరసనల్లో హింస‌ కూడా చెలరేగింది. బెంగాల్ లో ఆ నిరసనలు, హింస ఇవ్వాళ్ళ కూడా కొనసాగింది. శనివారంనాడు హౌరాలో కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు అనేక వాహనాలకు, పలు భవనాలకు నిప్పు పెట్టారు. హౌరాలోని పంచ్లా ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పింది. నిరసనకారులకు పోలీసులకు మధ్య యుద్దవాతావరణమే నెలకొంది. నిరసనకారులు పోలీసులపై రాళ్ళతో దాడి చేయగా , పోలీసులు టియర్ గ్యాస్ వదిలారు.

హౌరాలోని ఉలుబేరియా, పంచ్లా, జగత్‌బల్లావ్‌పూర్‌లలో నిన్నటి నుంచి కర్ఫ్యూ కొనసాగుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇది జూన్ 15 వరకు విధించారు. జూన్ 13 వరకు ఇంటర్నెట్ సస్పెన్షన్ కొనసాగుతుంది.

కాగా శాంతిభద్రతలను కాపాడాలని ఆందోళనకారులను కోరిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రస్తుతం జరుగుతున్న హింసలో రాజకీయ హస్తం ఉందని శనివారంనాడు ఓ ట్వీట్ చేశారు.

“నేను ఇంతకు ముందే చెప్పాను, రెండు రోజులుగా హౌరాలో ద్వేషపూరిత సంఘటనలు జరుగుతున్నాయి. దీని వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. వారు అల్లర్లు కోరుకుంటున్నారు, అయితే దీనిని సహించేది లేదు. పోలీసులు వారిపై కఠినమైన‌ చర్యలు తీసుకుంటారు. బీజేపీ చేసిన పనికి ప్రజలెందుకు నష్టపోవాలి? ” అని ఆమె ట్వీట్ చేశారు.

మరో వైపు హౌరాలో జరుగుతున్న హింసపై బెంగాల్ బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందార్ తీవ్రంగా స్పందించారు. శాంతి భద్ర‌తలు కాపాడలేకపోతే మాకు అప్పజెప్పండి. ఆ హింసను మేము 30 నిమిషాల్లో ఆపుతాము” అని మజుందారన్నారు.

Tags:    
Advertisement

Similar News