పర్వేజ్ ముషారఫ్ మరణించలేదు…కుటుంబం ప్రకటన‌

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణించలేదని ఆయన కుటుంబం స్పష్టం చేసింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆయన అవయావాలేవీ పని చేయడం లేదని కోలుకోవడం సాధ్యం కాదని ఆయన కుటుంబసభ్యులు సందేశం పంపారు. “అతను వెంటిలేటర్ మీద‌ లేరు. అతని అనారోగ్యం (అమిలోయిడోసిస్) కారణంగా గత 3 వారాలుగా ఆసుపత్రిలో ఉన్నారు. అవయవాలు పనిచేయని క్లిష్ట దశలో, కోలుకోవడం సాధ్యంకాని పరిస్థితిలో ఉన్నారు. అతని కోసం ప్రార్థించండి” అంటూ ఆయన కుటుంబం […]

Advertisement
Update: 2022-06-11 00:25 GMT

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణించలేదని ఆయన కుటుంబం స్పష్టం చేసింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆయన అవయావాలేవీ పని చేయడం లేదని కోలుకోవడం సాధ్యం కాదని ఆయన కుటుంబసభ్యులు సందేశం పంపారు.

“అతను వెంటిలేటర్ మీద‌ లేరు. అతని అనారోగ్యం (అమిలోయిడోసిస్) కారణంగా గత 3 వారాలుగా ఆసుపత్రిలో ఉన్నారు. అవయవాలు పనిచేయని క్లిష్ట దశలో, కోలుకోవడం సాధ్యంకాని పరిస్థితిలో ఉన్నారు. అతని కోసం ప్రార్థించండి” అంటూ ఆయన కుటుంబం ట్వీట్ పేర్కొన్నారు.

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ శుక్రవారం మరణించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ముషారఫ్ కుటుంబం చేసిన ఈ ట్వీట్ పాకిస్తాన్ మీడియాలో గందరగోళాన్ని సృష్టించింది
పాకిస్థాన్ మీడియా సంస్థ వక్త్ న్యూస్ తమ ట్విట్టర్ హ్యాండిల్‌లో పర్వేజ్ ముషారఫ్ మరణించిన వార్తను పోస్ట్ చేసి ఆ తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించారు.

Tags:    
Advertisement

Similar News