‘ఆధార్ వల్ల ప్రభుత్వానికి 2 లక్షల కోట్లకు పైగా ఆదా’

ఆధార్ వల్ల ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదా అయ్యిందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌ పునాదిగా మారిందని, నకిలీలను గుర్తించడానికి ఆధార్ చాలా బాగా ఉపయోగపడుతోందని ఆయన తెలిపారు. ఆధార్ అనేది అత్యంత విజయవంతమైన బయోమెట్రిక్ గా గుర్తింపు పొందిందన్నారు అమితాబ్ కాంత్. ‘ఆధార్ వినియోగాన్ని సరళీకృతం చేయడానికి తీసుకుంటున్న చర్యలు’ అనే అంశంపై ఢిల్లీలో జరిగిన ఒక వర్క్‌షాప్‌లో కాంత్ మాట్లాడుతూ, “ప్రభుత్వ […]

Advertisement
Update: 2022-06-02 05:17 GMT

ఆధార్ వల్ల ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదా అయ్యిందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌ పునాదిగా మారిందని, నకిలీలను గుర్తించడానికి ఆధార్ చాలా బాగా ఉపయోగపడుతోందని ఆయన తెలిపారు. ఆధార్ అనేది అత్యంత విజయవంతమైన బయోమెట్రిక్ గా గుర్తింపు పొందిందన్నారు అమితాబ్ కాంత్.

‘ఆధార్ వినియోగాన్ని సరళీకృతం చేయడానికి తీసుకుంటున్న చర్యలు’ అనే అంశంపై ఢిల్లీలో జరిగిన ఒక వర్క్‌షాప్‌లో కాంత్ మాట్లాడుతూ, “ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ పునాదిగా మారింది, దీనివల్ల ప్రజలకు వేగవంతంగా ప్రయోజనాలు బదిలీ అయ్యాయి. మధ్యవర్తుల జోక్యం లేకుండా పోయింది. అధిక మొత్తంలో డబ్బు ఆదా అయ్యింది.” అన్నారు.

“315 కేంద్ర పథకాలు, 500 రాష్ట్ర పథకాలు ప్రజలకు సక్రమంగా అందడానికి ఆధార్‌ను ఉపయోగించుకోవడం నకిలీలను గుర్తించి తొలగించడం ద్వారా ప్రభుత్వానికి ₹ 2.22 లక్షల కోట్ల రూపాయలను ఆదా అయ్యింది” అని కాంత్ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News