మంకీపాక్స్‌ను గుర్తించే ఆర్టీ-పీసీఆర్ కిట్ రెడీ

ప్రపంచమంతా కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడక ముందే కొన్ని దేశాల్లో మంకీపాక్స్ (Monkey pox) వైరస్ కలకలం సృష్టిస్తుంది. దాదాపు 20 దేశాల్లో మంకీపాక్స్ వ్యాపించి, ప్రజలను ఇబ్బందులు పెడుతున్నది. ఇప్పటికే 200పైగా కేసులు వెలుగు చూడగా.. మరో 100పైగా అనుమానిత కేసులు బయటపడ్డాయి. మన దేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ జాడ లేకపోయినా.. అంతర్జాతీయ ప్రయాణాల నేపథ్యంలో వైరస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. అయితే ప్రారంభ దశలోనే మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఇప్పటి […]

Advertisement
Update: 2022-05-28 07:57 GMT

ప్రపంచమంతా కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడక ముందే కొన్ని దేశాల్లో మంకీపాక్స్ (Monkey pox) వైరస్ కలకలం సృష్టిస్తుంది. దాదాపు 20 దేశాల్లో మంకీపాక్స్ వ్యాపించి, ప్రజలను ఇబ్బందులు పెడుతున్నది. ఇప్పటికే 200పైగా కేసులు వెలుగు చూడగా.. మరో 100పైగా అనుమానిత కేసులు బయటపడ్డాయి. మన దేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ జాడ లేకపోయినా.. అంతర్జాతీయ ప్రయాణాల నేపథ్యంలో వైరస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. అయితే ప్రారంభ దశలోనే మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఇప్పటి వరకు మన దగ్గర ఎలాంటి పరీక్షలు అందుబాటులో లేవు. ఈ క్రమంలో మన దేశానికి చెందిన మెడికల్ పరికరాల తయారీ కంపెనీ ట్రివిట్రాన్ హెల్త్ కేర్ ఒక ఆర్టీ-పీసీఆర్ కిట్‌ను తయారు చేసినట్లు ప్రకటించింది.

తమ సంస్థ రూపొందించిన ఈ కిట్ ద్వారా గంటలోనే ఫలితం తెలుసుకోవచ్చని ట్రివిట్రాన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ సంస్థకు చెందిన ఆర్ అండ్ డీ టీమ్.. మంకీపాక్స్‌ను గుర్తించడానికి నాలుగు రంగుల ఫ్లోరోసెన్స్ విధానంలో ఈ కిట్ తయారు చేసినట్లు చెప్పింది. వన్ ట్యూబ్ సింగిల్ రియాక్షన్‌ ఫార్మాట్‌లో స్మాల్ పాక్స్, మంకీపాక్స్ మధ్య తేడాను ఇది గుర్తిస్తుందని ట్రివిట్రాన్ ఆ ప్రకటనలో వివరించింది.

దేశంలో ఈ వైరస్ వ్యాప్తిని తక్షణం అడ్డుకోవడానికి ఈ కిట్లు ఉపయోగపడతాయని ఆ సంస్థ సీఈవో చంద్ర గంజూ అన్నారు. ఈ కిట్లను మన దేశంలో వాడటంతో పాటు ఇతర దేశాలకు కూడా ఎక్స్‌పోర్ట్ చేయనున్నట్లు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News