మూడు దశాబ్ధాల తర్వాత ఫ్రాన్స్ ప్రధానిగా మహిళ‌

ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా ఎలిసబెత్ బోర్న్ ఎంపికయ్యారు, 30 ఏళ్లలో ఒక మహిళ ఈ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. తన ప్రతిష్టాత్మక సంస్కరణ ప్రణాళికలకు నాయకత్వం వహించడానికి లేబర్ మంత్రి ఎలిసబెత్ బోర్న్‌ను ప్రధానమంత్రిగా నియమించారు. మే 1991 మరియు ఏప్రిల్ 1992 మధ్య పనిచేసిన ఎడిత్ క్రెస్సన్ దేశంలో మొదటి మహిళా ప్రధాని కాగా బోర్న్ రెండవ వారు. ఫ్రెంచ్ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్ తన పదవికి రాజీనామా చేయగా […]

Advertisement
Update: 2022-05-17 04:21 GMT

ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా ఎలిసబెత్ బోర్న్ ఎంపికయ్యారు, 30 ఏళ్లలో ఒక మహిళ ఈ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. తన ప్రతిష్టాత్మక సంస్కరణ ప్రణాళికలకు నాయకత్వం వహించడానికి లేబర్ మంత్రి ఎలిసబెత్ బోర్న్‌ను ప్రధానమంత్రిగా నియమించారు. మే 1991 మరియు ఏప్రిల్ 1992 మధ్య పనిచేసిన ఎడిత్ క్రెస్సన్ దేశంలో మొదటి మహిళా ప్రధాని కాగా బోర్న్ రెండవ వారు.

ఫ్రెంచ్ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్ తన పదవికి రాజీనామా చేయగా ఆ పదవి బోర్న్ ను వరించింది. తన ప్రణాళికను అమలుపర్చడానికి వామపక్ష భావజాలం, పర్యావరణ స్పృహ ఉన్న వారు కావాలని చెప్పిన అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అందుకు అణుగుణంగా బోర్న్ ను ఎంపికచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె త్వరలోనే తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు.

అధ్యక్షుడి ప్రణాళికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పలు శక్తులను ఎదుర్కొని పాలనను ముందుకు నడిపించగల కార్యదక్షురాలు బోర్న్ అని విశ్లేషకులు వర్ణిస్తున్నారు. అధ్యక్షుడు తన నూతన ప్రణాళికలో భాగంగా సామాజిక సంస్కరణల అమలును వేగవంతం చేశారు. అందులో ముఖ్యమైనది ఉద్యోగుల, కార్మికుల పదవీ విరమణ వయసును పొడిగించడం ఒకటి. ఈ నేపథ్యంలో బోర్న్ కార్మిక సంఘాలతో వివేకవంతంగా చర్చలు జరపగల సమర్దురాలైనా టెక్నోక్రాట్‌గా పరిగణించబడుతోంది.

పేరు చెప్పకూడదని కోరిన ఒక ఫ్రెంచ్ అధ్యక్ష అధికారి, శ్రీమతి బోర్న్‌ను “నమ్మకం, పని కలగలిపిన అద్భుత మహిళగా అభివర్ణించారు, ఆమె సంస్కరణలను నిర్వహించడానికి అన్ని విధాలా సామర్థ్యమున్న వ్యక్తి అని పేర్కొన్నారు.

“ఆమె గొప్ప వ్యక్తి, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో గొప్ప అనుభవం ఉంది.. ఆమె చాలా మంచి ఎంపిక” అని ఆ అధికారి అన్నారు.

అధికార మార్పిడికి గుర్తుగా సోమవారం జరిగిన వేడుకలో బోర్న్ మాట్లాడుతూ.. “మీ కలలను అన్ని విధాలుగా అనుసరించండి” అని పిలుపునిచ్చారు. “సమాజంలో మహిళల స్థానం కోసం జరిగే పోరాటాన్ని ఏ శక్తీ అడ్డుకోజాలదు” అని బోర్న్ స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News