వయసు 30 ఏళ్లు.. పిల్లలు 47 మంది.. ఒక అమెరికన్ రికార్డు

అతని పేరు కైల్ గార్డీ. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటాడు. ప్రస్తుతం అతని వయసు 30 ఏళ్లే. కానీ 47 మందికి తండ్రయ్యాడు. అరె, అంత చిన్న వయసులో అంత మందికి తండ్రా? అతనికి ఎంత మంది భార్యలు అని ఆశ్చర్యపోతున్నారా? అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. అతడు తండ్రనేది నిజమే. కానీ మహిళలతో సెక్స్ చేయకుండానే పుట్టిన పిల్లలు వాళ్లందరూ. ఆ 47 మందికి అతడు ‘బయలాజికల్ ఫాదర్’. కైల్ గార్డీ ఒక స్పెర్మ్ డోనర్. అతడు […]

Advertisement
Update: 2022-05-01 00:02 GMT

అతని పేరు కైల్ గార్డీ. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటాడు. ప్రస్తుతం అతని వయసు 30 ఏళ్లే. కానీ 47 మందికి తండ్రయ్యాడు. అరె, అంత చిన్న వయసులో అంత మందికి తండ్రా? అతనికి ఎంత మంది భార్యలు అని ఆశ్చర్యపోతున్నారా? అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. అతడు తండ్రనేది నిజమే. కానీ మహిళలతో సెక్స్ చేయకుండానే పుట్టిన పిల్లలు వాళ్లందరూ. ఆ 47 మందికి అతడు ‘బయలాజికల్ ఫాదర్’.

కైల్ గార్డీ ఒక స్పెర్మ్ డోనర్. అతడు ఒక ప్రొఫెషన్‌లా దాన్ని స్వీకరించాడు. ఈ క్రమంలో గత 8 ఏళ్లుగా తీరిక లేకుండా వీర్యదానం చేస్తూనే ఉన్నాడు. అలా గార్డీ వీర్యంతో 47 మంది పిల్లలు పుట్టారు. త్వరలోనే మరో 10 మంది పిల్లలు పుట్టబోతున్నారు. తాను నిరంతరం ఇదే పని మీద ఉండటంతో వ్యక్తిగత జీవితంలో చాలా కోల్పోయానని చెప్తున్నాడు. డేటింగ్ చేయడం, జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కూడా ఇబ్బంది అవుతుందని అంటున్నాడు. తనను మహిళలు కేవలం స్పెర్మ్ డోనర్ గానే చూస్తున్నారని.. పిల్లల కోసం మాత్రమే సంప్రదిస్తున్నారని వాపోతున్నాడు.

కైల్ గార్డీకి దీర్ఘకాలిక రోగాలు లేకపోవడం, మంచి ఆరోగ్యంగా ఉండటం, అతడి జీవన శైలి బాగుండటంతో చాలా మంది మహిళలు అతడి వీర్యాన్నే కోరుకుంటున్నారట. స్పెర్మ్ బ్యాంకులకు కూడా వెళ్లకుండా నేరుగా అతడికే మెసేజెస్ చేస్తున్నట్లు చెప్తున్నాడు. గత 8 ఏళ్లలో దాదాపు 1000 మంది మహిళలు అతడిని పిల్లల కోసం సంప్రదించినట్లు పేర్కొన్నాడు. ఇప్పుడు అతడు వీర్యదానం చేయడానికి ప్రపంచమంతా చుట్టేస్తున్నాడు. ఎందుకంటే ఇతర దేశాల నుంచి కూడా అతడికి ఆఫర్లు బాగానే వస్తున్నాయి. దీంతో డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

Tags:    
Advertisement

Similar News