శ్రీలంకలో ఆందోళనలు, అరెస్ట్ లు.. కుప్పకూలిన ప్రభుత్వం..

శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించినా పౌరులు ఆందోళనలు ఆపలేదు. దేశ భవిష్యత్ కోసం ఎందాకైనా పోరాటం చేస్తామంటున్న శ్రీలంక ప్రజలు.. ఆంక్షలను సైతం ధిక్కరించి తమ అసహనాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో 644 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యుత్‌ కోతలపై నిరసన తెలియజేసేందుకు కరెంటు స్తంభం ఎక్కిన ఓ యువకుడు విద్యుత్ షాక్ కి గురై చనిపోవడంతో ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు. అధ్యక్షుడు రాజపక్స ఇంటిని నిరసనకారులు చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్షాలు నిరసనలకు దిగడంతో శ్రీలంక ప్రభుత్వం […]

Advertisement
Update: 2022-04-03 20:54 GMT

శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించినా పౌరులు ఆందోళనలు ఆపలేదు. దేశ భవిష్యత్ కోసం ఎందాకైనా పోరాటం చేస్తామంటున్న శ్రీలంక ప్రజలు.. ఆంక్షలను సైతం ధిక్కరించి తమ అసహనాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో 644 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యుత్‌ కోతలపై నిరసన తెలియజేసేందుకు కరెంటు స్తంభం ఎక్కిన ఓ యువకుడు విద్యుత్ షాక్ కి గురై చనిపోవడంతో ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు. అధ్యక్షుడు రాజపక్స ఇంటిని నిరసనకారులు చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు.

ప్రతిపక్షాలు నిరసనలకు దిగడంతో శ్రీలంక ప్రభుత్వం 36 గంటలపాటు కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూ ఆంక్షలు ఉన్నాకూడా ప్రతిపక్షాలు ర్యాలీలు చేపట్టాయి. వేలాదిమంది విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యానన్‌ లు ప్రయోగించారు. మరోవైపు సోషల్‌ మీడియాపై విధించిన నిషేధాన్ని శ్రీలంక ప్రభుత్వం తొలగించింది.

కుప్పకూలిన ప్రభుత్వం..
శ్రీలంక అధ్యక్షుడి రాజీనామాకోసం ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో 26 మంది కేబినెట్ మంత్రులు రాజీనామా చేయడం విశేషం. శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సకు వారు రాజీనామాలు సమర్పించారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ఆయన సోదరుడు, ప్రధాని మహింద రాజపక్స మాత్రం రాజీనామా చేయలేదు. ప్రభుత్వం మార్పుకోసం ప్రతిపక్షాలు, వివిధ రంగాల ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.

కొలంబోతో బంధాలు కట్..
పర్యాటకరంగంపై ఆధారపడిన శ్రీలంక ఇప్పుడు ఆ ఆదాయాన్ని పూర్తిగా కోల్పోతోంది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకవైపు ఎవరూ చూడటంలేదు. భారత్ నుంచి కూడా విమాన సర్వీసులు పూర్తిగా తగ్గించేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, చెన్నై నుంచి కొలంబోకు వారంలో 16 సర్వీసులు నడుస్తున్నాయి. డిమాండ్ లేకపోవడంతో వీటిని సగానికి సగం తగ్గిస్తూ ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది.

Tags:    
Advertisement

Similar News