5 నగరాల్లో కాల్పుల విరమణ.. టర్కీ రాయబారం ఫలిస్తుందా..?

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఈరోజు బాంబుల మోత కాస్త తగ్గింది. అయిదు నగరాల్లో రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. పౌరులను తరలించేందుకే కాల్పులకు ఒకరోజు విరామం ఇస్తున్నట్టు ప్రకిటించింది రష్యా. ఉదయం 10 గంటల నుంచి కీవ్, చెర్నిగోవ్, సుమీ, మేరియుపోల్‌, ఖర్కీవ్‌ నగరాల నుంచి పౌరుల తరలింపు మొదలైంది. మానవతా కారిడార్‌ ల పేరుమీద ఉక్రెయిన్ లోని ఐదు నగరాలనుంచి సాధారణ పౌరులను తరలిస్తున్నారు. టర్కీలో కీలక భేటీ.. ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా […]

Advertisement
Update: 2022-03-08 05:43 GMT

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఈరోజు బాంబుల మోత కాస్త తగ్గింది. అయిదు నగరాల్లో రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. పౌరులను తరలించేందుకే కాల్పులకు ఒకరోజు విరామం ఇస్తున్నట్టు ప్రకిటించింది రష్యా. ఉదయం 10 గంటల నుంచి కీవ్, చెర్నిగోవ్, సుమీ, మేరియుపోల్‌, ఖర్కీవ్‌ నగరాల నుంచి పౌరుల తరలింపు మొదలైంది. మానవతా కారిడార్‌ ల పేరుమీద ఉక్రెయిన్ లోని ఐదు నగరాలనుంచి సాధారణ పౌరులను తరలిస్తున్నారు.

టర్కీలో కీలక భేటీ..
ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా మధ్య రెండుసార్లు చర్చలు జరిగినా అవి సత్ఫలితాలను ఇవ్వలేదు. మరోసారి మార్చి 10న రెండు దేశాల విదేశాంగ మంత్రులు టర్కీలో భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంధి కుదిర్చేందుకు టర్కీ చేసిన రాయబార ప్రయత్నం ఫలించింది. దీంతో టర్కీలోనే రెండు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ కావడానికి ముందుకొచ్చారు. మార్చి 10న జరిగే ఈ భేటీతో అయినా యుద్ధం ఆగుతుందేమోననే ఆశ రెండు దేశాల్లో నెలకొంది.

భారీగా వలసలు..
ఇప్పటికే 12లక్షలమంది ప్రజలు ఉక్రెయిన్ నుంచి విదేశాలకు తరలి వెళ్లారు. సోమవారం ఒక్కరోజే లక్షా 40వేలమంది సరిహద్దులు దాటినట్టు బోర్డర్ గార్డ్ ఏజెన్సీ తెలిపింది. ముఖ్యంగా పోలండ్ కి ఉక్రెయిన్ పౌరులు భారీగా తరలి వెళ్తున్నట్టు సమాచారం.

సుమీ నుంచి భారతీయుల తరలింపు మొదలు..
ఉక్రెయిన్‌ లోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను సురక్షితంగా సొంత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే సుమీ పట్టణంనుంచి మాత్రం తరలింపు బాగా ఆలస్యమైంది. అక్కడినుంచి సరిహద్దు దేశాలకు రావడం కష్టసాధ్యం కావడంతో విద్యార్థులు యుద్ధ భయంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. తాజాగా వారందర్నీ.. బస్సుల్లో పోల్తావాకు తరలిస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్‌ దీప్‌ సింగ్‌ తెలిపారు. పోల్తావా నుంచి భారత్ కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News