భజరంగ్ దళ్ కార్యకర్త హత్యతో కర్నాటకలో అల్లర్లు.. ముగ్గురు అరెస్ట్..

నిన్న మొన్నటి వరకు హిజాబ్ వివాదంతో అట్టుడికిపోతున్న కర్నాటకలో తాజాగా మరో గొడవ మొదలైంది. భజరంగ్ దళ్ కార్యకర్త హత్య సంచలనంగా మారింది. దుండగులు ఆయనపై కత్తితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపడంతో ఆందోళనలు మొదలయ్యాయి. పలు చోట్ల భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆస్తుల ధ్వంసం, ఘర్షణలు చోటు చేసుకోవడంతో పోలీసులు శివమొగ్గ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. ముందస్తు జాగ్రత్తగా అధికారులు […]

Advertisement
Update: 2022-02-21 20:53 GMT

నిన్న మొన్నటి వరకు హిజాబ్ వివాదంతో అట్టుడికిపోతున్న కర్నాటకలో తాజాగా మరో గొడవ మొదలైంది. భజరంగ్ దళ్ కార్యకర్త హత్య సంచలనంగా మారింది. దుండగులు ఆయనపై కత్తితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపడంతో ఆందోళనలు మొదలయ్యాయి. పలు చోట్ల భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆస్తుల ధ్వంసం, ఘర్షణలు చోటు చేసుకోవడంతో పోలీసులు శివమొగ్గ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. ముందస్తు జాగ్రత్తగా అధికారులు రెండురోజులపాటు విద్యా సంస్థలకు సెలవలు ప్రకటించారు.

శివమొగ్గకు చెందిన 23ఏళ్ల హర్ష అనే యువకుడని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు. అతను భజరంగ్ దళ్ కి చెందిన కార్యకర్త కావడంతో ఈ వివాదంపై రాజకీయ రగడ మొదలైంది. హర్ష కుటుంబ సభ్యులు, బంధువులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. కొన్ని చోట్ల ఆందోళనకారులు టైర్లు, వాహనాలు దహనం చేయడం, రాళ్లు విసిరిన ఘటనలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆంక్షలు విధించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. హత్యా రాజకీయాలకు, రాష్ట్రంలో అశాంతికి కారణం మీరంటే మీరని తిట్టిపోసుకున్నారు.

బసవరాజ్ బొమ్మైకి తలనొప్పి..
సీఎం పీఠం మీద కూర్చున్నాక బసవరాజ్ బొమ్మైకి వరుసగా తలనొప్పులు మొదలయ్యాయి. హిజాబ్ వివాదంతో రాష్ట్రంలో అశాంతి చెలరేగగా, ఇప్పుడీ హత్య ఘటనతో ఆయన మరింత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భజరంగ్ దళ్ కార్యకర్త హత్య ఘటనపై దర్యాప్తు మొదలైందని, కొన్ని కీలక ఆధారాలు కూడా లభించాయని అన్నారు సీఎం బసవరాజ్ బొమ్మై. శివమొగ్గ ప్రజలు శాంతియుతంగా ఉండాలని, పుకార్లను నమ్మొద్దని ఆయన కోరారు. మరోవైపు ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు కర్నాటక హోం మంత్రి అరాగ జ్ఞానేంద్ర వెల్లడించారు. మొత్తం ఐదుగురు వ్యక్తులకు ఈ హత్యతో సంబంధం ఉన్నట్టు అనుమానాలున్నాయని, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు.

Tags:    
Advertisement

Similar News