కరోనా పని పట్టగల మినీ యాంటీబాడీలు

కరోనాపై రోజురోజుకీ పరిశోధనలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా జర్మనీ శాస్త్రవేత్తలు ఎంతో కాలంగా పని చేసి మహమ్మారి సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తివంతమైన మినీ యాంటీబాడీలను డెవలప్ చేశారు. ఇవెలా పనిచేస్తాయంటే.. దక్షిణ అమెరికాలో ఉండే ఆల్పకా అనే ఒంటె జాతి జంతువుల రక్తం ద్వారా పరిశోధకులు యాంటీబాడీలను తయారుచేశారు. ప్రమాదకర కరోనా వేరియంట్లను కూడా ఇవి సమర్థంగా అడ్డుకోగలవని జర్మనీ పరిశోధకులు చెప్తున్నారు. జర్మనీలోని గొటింజెన్‌లోని యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్, మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ బయోఫిజికల్‌ […]

Advertisement
Update: 2021-07-30 03:38 GMT

కరోనాపై రోజురోజుకీ పరిశోధనలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా జర్మనీ శాస్త్రవేత్తలు ఎంతో కాలంగా పని చేసి మహమ్మారి సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తివంతమైన మినీ యాంటీబాడీలను డెవలప్ చేశారు. ఇవెలా పనిచేస్తాయంటే..

దక్షిణ అమెరికాలో ఉండే ఆల్పకా అనే ఒంటె జాతి జంతువుల రక్తం ద్వారా పరిశోధకులు యాంటీబాడీలను తయారుచేశారు. ప్రమాదకర కరోనా వేరియంట్లను కూడా ఇవి సమర్థంగా అడ్డుకోగలవని జర్మనీ పరిశోధకులు చెప్తున్నారు.

జర్మనీలోని గొటింజెన్‌లోని యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్, మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ బయోఫిజికల్‌ కెమిస్ట్రీ శాస్త్రవేత్తలు ఈ మినీ యాంటీబాడీలను డెవలప్ చేశారు. వాళ్లు రూపొందించిన ఈ మినీ యాంటీబాడీలు.. ప్రస్తుత యాంటీబాడీల కంటే వెయ్యి రెట్ల శక్తితో వైరస్‌ను బంధించి, బలహీనపరుస్తాయని వారు చెప్తున్నారు. ఈ యాంటీబాడీలు 95 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుని, సమర్థంగా పనిచేయగలవంటున్నారు.

త్వరలోనే వీటిపై ట్రయల్స్ నిర్వహిస్తామని, వీటిని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు కూడా తక్కువే కాబట్టి.. ప్రపంచ వ్యాప్తంగా ఈ చికిత్సలను అందించేందుకు ప్రయత్నిస్తామని జర్మనీ సైంటిస్ట్ డిర్క్‌ గోర్లిచ్‌ అన్నారు. ఈ యాంటీబాడీలు భయంకరమైన ఆల్ఫా, బీటా, గామా, డెల్టా లాంటి వేరియంట్ల పని కూడా పట్టగలవని వాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News