ఏపీలో పది, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు..

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ సడలింపులు అమలులోకి వచ్చేశాయి. నెలాఖరులోగా పూర్తిగా అన్నిటికీ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత కొత్తగా అకడమిక్ ఇయర్ కొనసాగించే ఆలోచన చేస్తోంది ఏపీ ప్రభుత్వం. జులైలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు మంత్రి ఆదిమూలపు సురేష్ సూచన ప్రాయంగా తెలిపారు. జులై మొదటి […]

Advertisement
Update: 2021-06-15 07:10 GMT

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ సడలింపులు అమలులోకి వచ్చేశాయి. నెలాఖరులోగా పూర్తిగా అన్నిటికీ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత కొత్తగా అకడమిక్ ఇయర్ కొనసాగించే ఆలోచన చేస్తోంది ఏపీ ప్రభుత్వం. జులైలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు మంత్రి ఆదిమూలపు సురేష్ సూచన ప్రాయంగా తెలిపారు.

జులై మొదటి వారంలో ఇంటర్, చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందని తెలిపారు మంత్రి సురేష్. అయితే దీనిపై సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారాయన. విద్యార్థుల ప్రయోజనం కోసమే పరీక్షలు నిర్వహించబోతున్నట్టు చెప్పారు.

ఇంటర్ పరీక్షలు పూర్తయితే ఇంజినీరింగ్, ఇతర ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశముంది. దీంతో జులైలో పరీక్షలు పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టులో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ, ఇతర ఉమ్మడి పోటీ పరీక్షలు ఉండే అవకాశముంది. ఆ తర్వాత కౌన్సెలింగ్ లు నిర్వహించి సెప్టెంబరులో ఆయా కోర్సులకు తరగతులు ప్రారంభిస్తారు. ఏపీలో ఇంటర్ పరీక్షలకు 10లక్షలమంది విద్యార్థులు హాజరవుతారని అంచనా. పరీక్షల నిర్వహణకు 15 రోజుల ముందు షెడ్యూలు ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 20 వరకు ఏపీలో కర్ఫ్యూ అమలులో ఉంది. ఆ తర్వాత వైద్యశాఖ అధికారుల సూచనలతో పరీక్షల సమయాన్ని ప్రకటించాలని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News