సీజనల్ వ్యాధిగా కరోనా?

సాధారణంగా వైరస్ తో వ్యాపించే వ్యాధులు కొద్ది కాలంపాటు తమ ప్రభావాన్ని చూపి కొంతకాలానికి కనుమరుగైపోతాయి. కానీ, కరోనా అలా కాకుండా సాధారణ సీజనల్ వ్యాధిలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి అంటోంది. కరోనా, ఫ్లూ దాదాపుగా ఒకే రకమైన వ్యాధులు కావడంతో.. ఇదే పరిస్థితి కొన్నేళ్లు కొనసాగితే కరోనా కూడా సీజనల్‌ వ్యాధిగా మారుతుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది. సీజనల్ వ్యాధిగా మార్పు చెందితే.. అత్యంత శీతల వాతావరణంలో […]

Advertisement
Update: 2021-03-19 04:48 GMT

సాధారణంగా వైరస్ తో వ్యాపించే వ్యాధులు కొద్ది కాలంపాటు తమ ప్రభావాన్ని చూపి కొంతకాలానికి కనుమరుగైపోతాయి. కానీ, కరోనా అలా కాకుండా సాధారణ సీజనల్ వ్యాధిలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి అంటోంది.

కరోనా, ఫ్లూ దాదాపుగా ఒకే రకమైన వ్యాధులు కావడంతో.. ఇదే పరిస్థితి కొన్నేళ్లు కొనసాగితే కరోనా కూడా సీజనల్‌ వ్యాధిగా మారుతుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది. సీజనల్ వ్యాధిగా మార్పు చెందితే.. అత్యంత శీతల వాతావరణంలో కరోనా వ్యాప్తి ఎలా చెందుతుందో, వేడి వాతావరణంలో కూడా అదే స్థాయిలో విజృంభిస్తోందని బృందం చెప్తోంది. కరోనా ఇప్పుడు పూర్తిగా తగ్గినట్టు కనిపించినా.. రాబోయేకాలంలో మళ్లీ సీజనల్ వ్యాధిలా అప్పుడప్పుడూ వస్తూనే ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ లెక్కన హాని చేసే కెపాసిటీ తగ్గినప్పటికీ.. కరోనా మాత్రం ఎప్పటికీ మన మధ్యనే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News