చంద్రుడిపై చెట్లు పెంచే పనిలో ఉన్న చైనా

చెట్టు ఉంటే జీవం ఉన్నట్టే.. కానీ ఈ విశ్వంలో ఒక్క భూమి మీద తప్ప మరెక్కడా జీవం ఉన్న ధాఖలాలు లేవు. అయితే కృత్రిమంగా మనమే జీవాన్ని సృష్టించొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే చైనా సైంటిస్టులు ఓ అడుగు ముందుకేసి ఏకంగా చంద్రుడిపై చెట్లు నాటే ప్రయోగం చేశారు. రీసెంట్ గా చైనా ప్రకటించిన దాని ప్రకారం.. వాతావరణమే లేని చంద్రుడిపై చెట్లు పెంచామని, తమ లూనార్‌ మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగం విజయవంతమైందని చైనా […]

Advertisement
Update: 2021-03-10 01:52 GMT

చెట్టు ఉంటే జీవం ఉన్నట్టే.. కానీ ఈ విశ్వంలో ఒక్క భూమి మీద తప్ప మరెక్కడా జీవం ఉన్న ధాఖలాలు లేవు. అయితే కృత్రిమంగా మనమే జీవాన్ని సృష్టించొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే చైనా సైంటిస్టులు ఓ అడుగు ముందుకేసి ఏకంగా చంద్రుడిపై చెట్లు నాటే ప్రయోగం చేశారు.
రీసెంట్ గా చైనా ప్రకటించిన దాని ప్రకారం.. వాతావరణమే లేని చంద్రుడిపై చెట్లు పెంచామని, తమ లూనార్‌ మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగం విజయవంతమైందని చైనా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా బయటపెట్టి సంబరపడుతున్నారుచైనా సైంటిస్టులు. చంద్రుడిపై వాతావరణం లేనందున నేరుగా చంద్రుడిపై విత్తనాలు నాటకుండా.. ఒక కంటైనర్‌ లో చెట్లు పెరిగేందుకు కావాల్సిన పోషకాలను ఉంచి కృత్రిమ వాతావరణాన్ని క్రియేట్ చేసి, దాన్ని లూనార్‌ ప్రోబ్‌తో పాటు చంద్రుడిపైకి పంపారు. అక్కడ చంద్ర ఉపరితలంపై ఈ కంటైనర్లను జారవిడిచి పరిశీలిస్తే మొలకలు వచ్చినట్లు గమనించారు.

అంతరిక్ష ప్రయోగాల్లో ఇదో కొత్త అడుగు అని చెప్పొచ్చు. కానీ చైనా వస్తువుల్లాగానే చైనా మాటలు, పనులను నమ్మడానికి వీల్లేదని కొంతమంది అనుమానపడుతున్నారు. ఇదిలా ఉంటే త్వరలో చైనా చంద్రుడిపై ఒక బేస్‌ కట్టే ప్లాన్‌లో ఉంది. ప్రస్తుతానికి చేసిన ఈ చిన్న ప్రయోగం సక్సెస్ అయిందని, రాబోయే రోజుల్లో నేరుగా చంద్రుడిపై చెట్లు పెంచేస్తామని చైనా సైంటిస్టులు ధీమా వ్యక్తం చేస్తున్నారు

Tags:    
Advertisement

Similar News