ఏబీసీ జ్యూస్ గురించి తెలుసా?

ఏబీసీ జ్యూస్ ఎప్పుడైనా తాగారా? ఏబీసీ జ్యూస్ ఏంటి అనుకుంటున్నారా? ఇదొక మ్యూజికల్ డ్రింక్. అసలీ జ్యూస్ ఎలా చేస్తారో.. దీని ప్రయోజనాలేంటో చూద్దాం. ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బీట్ రూట్, క్యారెట్ లతో కలిపి చేసే జ్యూస్. ఎన్నో పోషకాలు,విటమిన్లు,ఖనిజాలు సమృద్ధిగా కలిగి ఉన్న యాపిల్, బీట్ రూట్, క్యారెట్ లను కలిపి తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. ఈ జ్యూస్ లో ఉండే యాపిల్స్‌లో విటమిన్ ఎ, బి 1, బి 2, […]

Advertisement
Update: 2021-02-19 04:35 GMT

ఏబీసీ జ్యూస్ ఎప్పుడైనా తాగారా? ఏబీసీ జ్యూస్ ఏంటి అనుకుంటున్నారా? ఇదొక మ్యూజికల్ డ్రింక్. అసలీ జ్యూస్ ఎలా చేస్తారో.. దీని ప్రయోజనాలేంటో చూద్దాం.

ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బీట్ రూట్, క్యారెట్ లతో కలిపి చేసే జ్యూస్. ఎన్నో పోషకాలు,విటమిన్లు,ఖనిజాలు సమృద్ధిగా కలిగి ఉన్న యాపిల్, బీట్ రూట్, క్యారెట్ లను కలిపి తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి.

ఈ జ్యూస్ లో ఉండే యాపిల్స్‌లో విటమిన్ ఎ, బి 1, బి 2, బి 6, సి, ఇ కె, ఫోలేట్, నియాసిన్, జింక్, కాపర్, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం, ఐరన్, కాల్షియం, సోడియం, మాంగనీస్ వంటి అన్ని పోషకాలు ఉన్నాయి. యాపిల్స్‌లో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థకు ఉపయోగపడుతుంది.

క్యారెట్
క్యారెట్‌లో విటమిన్ ఎ, బి 1, బి 2, బి 3, బి 6, సి, ఇ, కె, ఫోలేట్, నియాసిన్ వంటి అనేక రకాల విటమిన్లు ఉంటాయి. వాటితో పాటు పొటాషియం, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇందులో ఉండే బీటా కెరోటిన్.. కంటి ఆరోగ్యానికి మంచిది.

బీట్రూట్
బీట్‌రూట్‌లో విటమిన్ ఎ, సి, బి-కాంప్లెక్స్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, రాగి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బీట్‌రూట్స్‌లో లైకోపీన్, ఆంథోసైనిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.

లాభాలివే..
ప్రతిరోజూ ఈ ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను తగ్గించుకోవచ్చు. ఈ జ్యూస్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించి, దాదాపు అన్ని రకాల క్యాన్సర్లను నయం చేస్తుంది. కిడ్నీ, కాలేయంతో పాటు శరీరంలోని కొన్ని ముఖ్యమైన ఇతర అవయవాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఈ జ్యూస్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఇందులో ఉండే ఆల్ఫా మరియు బీటా కెరోటిన్లు, లుటిన్ వంటి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
మచ్చలేని చర్మం కోసం మొటిమలను దూరంగా ఉంచడంలో ఇది చాలా సహాయపడుతుంది. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. ఒక గ్లాస్ జ్యుస్ రోజూ తీసుకుంటే, ప్రకాశవంతమైన యవ్వనంగా కనిపించే చర్మం సొంతమవుతుంది.

ఈ జ్యుస్ జీర్ణవ్యవస్థకు మంచిది. ఇది కడుపు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడటమే కాకుండా, పుండ్లు, అల్సర్ల నుంచి కూడా రక్షిస్తుంది. ఈ జ్యూస్ కాలేయం,రక్తం శుద్దీకరణకు ఇది సహాయపడుతుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే కంటి ఆరోగ్యానికి, మెదడు చురుకుగా పని చేయడానికి కూడా ఈ జ్యుస్ సాయపడుతుంది.

Tags:    
Advertisement

Similar News