2020లో గూగుల్‌లో ఎక్కువగా వీటి గురించే సెర్చ్ చేశారు....

మన ఇండియన్స్ ఏం ఎక్కువ సెర్చ్‌ చేశారో తెలుసా? ఒకప్పుడు ఏదైనా డౌట్‌ వస్తే.. పెద్దవాళ్లను అడిగేవాళ్లు. వాళ్ల వల్ల కూడా కాకపోతే పుస్తకాలు తెరిచేవాళ్లు. ఇప్పుడు అలా కాదు, ఏ డౌట్ వచ్చినా సరే వెంటనే గూగుల్‌ని అడిగేస్తున్నారు. కరోనా వల్ల ఈ సంవత్సరంలో ఎక్కువ సమయంలో ఇంట్లోనే ఉన్నారు. అందులోనూ ఎక్కువ ఫోన్‌లతోనే గడిపారు కదా! దాంతో 2020లో గూగుల్‌తో సహవాసం పెరిగిపోయింది. 2020 సెర్చ్ ట్రెండ్‌ డేటాను గూగుల్‌ విడుదల చేసింది. ఈ […]

Advertisement
Update: 2020-12-11 01:58 GMT

మన ఇండియన్స్ ఏం ఎక్కువ సెర్చ్‌ చేశారో తెలుసా?

ఒకప్పుడు ఏదైనా డౌట్‌ వస్తే.. పెద్దవాళ్లను అడిగేవాళ్లు. వాళ్ల వల్ల కూడా కాకపోతే పుస్తకాలు తెరిచేవాళ్లు. ఇప్పుడు అలా కాదు, ఏ డౌట్ వచ్చినా సరే వెంటనే గూగుల్‌ని అడిగేస్తున్నారు. కరోనా వల్ల ఈ సంవత్సరంలో ఎక్కువ సమయంలో ఇంట్లోనే ఉన్నారు. అందులోనూ ఎక్కువ ఫోన్‌లతోనే గడిపారు కదా! దాంతో 2020లో గూగుల్‌తో సహవాసం పెరిగిపోయింది. 2020 సెర్చ్ ట్రెండ్‌ డేటాను గూగుల్‌ విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. ప్రపంచం దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టిందో అర్థమవుతుంది.

1.కరోనా వైరస్‌

కరోనా వైరస్! ఈ సంవత్సరం గూగుల్‌ సెర్చ్ ఇంజిన్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన అంశం! దాదాపు స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కొన్ని పదుల సార్లు కరోనా వైరస్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేసే ఉంటారు. కరోనా ఎలా పుట్టింది? ఎక్కడ పుట్టింది? ఎలా వస్తుంది? అనే విషయాల దగ్గర నుంచి కరోనా వ్యాక్సిన్ అప్‌డేట్స్ వరకూ గూగుల్‌ని అడుగుతూనే ఉన్నారు. ఎప్పుడైనా అమెరికా ఎన్నికల ఫలితాలు టాప్ ట్రెండింగ్‌లో ఉండేవి. కానీ, ఈసారి కరోనా వైరస్ దాన్ని కూడా రిప్లేస్ చేసింది.

2. బిజినెస్ పెట్టడం ఎలా?

కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. ‘ఈ ఉద్యోగం చేస్తే.. ఎప్పుడూ దిన దిన గండమే. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. కాబట్టి, చిన్నదైనా పర్లేదు ఒక బిజినెస్ పెట్టుకొని హాయిగా ఉండాలి’ అనుకున్నవాళ్లు కోట్లమంది ఉన్నారు. అందుకే, ‘ఏ బిజినెస్ అయితే బాగుంటుంది? చిన్న బిజినెస్‌లు ఏమున్నయ్?’ అని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది గూగుల్‌లో సెర్చ్ చేసిన అంశాల్లో ముందు వరుసలో నిలిచింది. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ అంశంపై రెండింతలు ఎక్కువగా సెర్చ్ చేశారు.

3. యాంటీ రేసిస్ట్‌గా ఉండటం ఎలా?

ఈ సంవత్సరం జూన్ వరకు ‘మిలియనీర్ కావడం ఎలా?’ అనే ప్రశ్నే దీనికన్నా ముందు ఉండేది. కానీ, అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ని పొలీసులు కిరాతంగా చంపిన తర్వాత ఆ దేశంలో జాత్యహంకార నిరసనలు వెల్లువెత్తాయి. ఆ ఉదాంతం చాలా దేశాలను ప్రభావితం చేసింది. దాంతో ‘యాంటీ రేసిస్ట్‌గా ఉండటం ఎలా?’ అనే అంశాన్ని గూగుల్‌ని కోట్లమంది అడిగారు.

4. సిస్టెమిక్ రేసిజం అంటే ఏంటి?

వ్యవస్థ, లేదా ప్రభుత్వం సమాజంలోని కొన్ని వర్గాల కోసమే పని చేస్తూ.. ఇతర వర్గాల మీద వివక్ష చూపించడమే సిస్టెమిక్ రేసిజం అంటారు. దీనివల్ల అధికారం, విద్య, ఉద్యోగాలు లాంటివి కొన్ని వర్గాలకే దక్కుతాయి. వీటిపై వాళ్ల పెత్తనం చేస్తూ ఇతరులపై వివక్ష చూపిస్తారు. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి కోట్ల మంది గూగుల్‌ని ఆశ్రయించారు.

5. వాతావరణ మార్పులను ఎలా ఆపాలి?

అడవుల నరికివేత పెరుగుతుండటం, దావాగ్నిలో అడవులు తగలబడిపోవడం, గ్రీన్ హౌజ్‌ గ్యాసెస్ వల్ల భూమి వేడెక్కడంతో పాటు అనేక ప్రకృతి విపత్తులను ఈసారి చాలామంది ప్రత్యక్షంగా చూశారు. దీంతో ‘ఈ వాతావరణ మార్పులను ఎలా ఆపాలి? దీనికి ఏం చేస్తే బాగుంటుంది?’ అని గూగుల్‌నే అడిగి తెలుసుకున్నారు.

6. వర్చువల్ మ్యూజియం

లాక్‌డౌన్‌లో అడుగు తీసి బయటపెట్టే అవకాశం లేకుండా పోయింది. దీంతో చాలామంది ఇంట్లోనే ఉంటూ.. వర్చువల్ టూర్స్ మొదలు పెట్టారు. అందులో ఎప్పుడూ లేనంతగా ఈసారి వర్చువల్ మ్యూజియం గురించి శోధించి దాన్ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు నెటిజన్స్‌.

7. కూరగాయలను పెంచడం ఎలా?

వర్క్ ఫ్రమ్‌ హోమ్‌తో చాలామంది ఇప్పటికీ ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఈసారి ఎప్పుడూ లేనంతంగా ఇంట్లోనే ఉండే అవకాశం వచ్చింది. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏం వస్తుంది? అందుకే, ‘ఇంట్లో కూరగాయలను పెంచడం ఎలా’ అని గూగుల్‌ని విపరీతంగా అడిగేశారు.

8. కోడింగ్‌ ఎలా నేర్చుకోవాలి?

ఇప్పుడు అన్ని ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రిప్లేస్ చేస్తోంది. మరి, ఆ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ నడవాలంటే సాఫ్ట్‌వేర్ అవసరం. అదే కోడింగ్. కోడింగ్ నేర్చుకుంటే ఫ్యూచర్‌‌లో జాబ్‌కి సెక్యూరిటీ ఉన్నట్టేగా? అందుకే, ఈ సారి ప్రపంచవ్యాప్తంగా యూత్‌ కోడింగ్‌ గురించి తెగ సెర్చ్ చేసేశారు.

మన దేశంలో కరోనాకు సెకెండ్ ప్లేస్‌

ప్రపంచమంతా కరోనా అప్‌డేట్స్‌ గురించి సెర్చ్ చేస్తుంటే మనవాళ్లు మాత్రం కరోనాకు రెండో ప్లేస్ ఇచ్చారు. మన దేశంలో ఎక్కువ శాతం సెర్చ్ చేసిన అంశాల్లో ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌ ఉంది. క్రికెట్‌ని ఆరాధించే దేశం అని నిరూపించారు. దీని తర్వాత ‘ఇంట్లోనే జున్ను తయారు చేసుకోవడం ఎలా? ఇమ్యూనిటీ పెంచుకోవడం ఎలా? డాల్గోనా కాఫీ ఎలా తయారు చేయాలి? కరోనా టెస్టింగ్‌ కిట్స్, దగ్గరల్లో లిక్కర్ షాపులు ఏం ఉన్నాయి? దగ్గరల్లో రెస్టారెంట్స్ ఏం ఉన్నాయి?’ లాంటి విషయాల్ని ఇండియాలో ఎక్కువ సెర్చ్ చేశారంటూ రాయిటర్స్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

Advertisement

Similar News