మన పార్టీ ఎమ్మెల్యేని పట్టించుకోకండి " పవన్‌ కళ్యాణ్‌

జనసేన తరఫున పోటీచేసి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్​ క్రమంగా ఆ పార్టీకి దూరమయ్యారు. అధికార పార్టీకి అనధికారికంగా మద్దతు తెలుపుతూ పార్టీ అధినాయకత్వానికి చిక్కులు తెస్తున్నాడు. ప్రజల పక్షాన మాట్లాడి జనసేన వాణిని అసెంబ్లీలో వినిపిస్తాడనుకుంటే.. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నాడు. పార్టీ అధినేత మాటను పెడచెవిన పెడుతున్నాడు. అతడిపై అనర్హత వేటు వేయిద్దామంటే ఆంధ్రప్రదేశ్​లోని పరిస్థితి గమనించి జనసేన అధినేత పవన్ కల్యాణ్​ సైలెంట్ అయిపోయారు. పవన్​ ఒకటంటే తనపార్టీ ఎమ్మెల్యే మరొకటి […]

Advertisement
Update: 2020-11-22 05:24 GMT

జనసేన తరఫున పోటీచేసి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్​ క్రమంగా ఆ పార్టీకి దూరమయ్యారు. అధికార పార్టీకి అనధికారికంగా మద్దతు తెలుపుతూ పార్టీ అధినాయకత్వానికి చిక్కులు తెస్తున్నాడు. ప్రజల పక్షాన మాట్లాడి జనసేన వాణిని అసెంబ్లీలో వినిపిస్తాడనుకుంటే.. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నాడు. పార్టీ అధినేత మాటను పెడచెవిన పెడుతున్నాడు. అతడిపై అనర్హత వేటు వేయిద్దామంటే ఆంధ్రప్రదేశ్​లోని పరిస్థితి గమనించి జనసేన అధినేత పవన్ కల్యాణ్​ సైలెంట్ అయిపోయారు.

పవన్​ ఒకటంటే తనపార్టీ ఎమ్మెల్యే మరొకటి అంటున్నాడు. అమరావతి రాజధానిగా ఉండేందుకు మద్దతు ఇవ్వాలని జనసేన నిర్ణయించింది. కానీ రాపాక మాత్రం తాను మూడు రాజధానులకే జై కొట్టాడు. సొంత పార్టీ నుంచి గెలుపొందినవాడే నీ మాట వినకపోతే.. నిన్ను ప్రజలెలా నమ్ముతారంటూ ఇతరపార్టీలు పవన్ ను సూటి పోటి మాటలంటున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక జనసేనాని తర్జనభర్జన పడుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి గెలుపొందిన రాపాక ఇప్పుడు జనసేనకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. అయితే అతడికి కీలెరిగి వాత పెట్టాలని పవన్​ కల్యాణ్​ నిర్ణయించుకున్నాడట. రాజోలు నియోజకవర్గంలోని జనసేన నేతలతో ఇటీవల పవన్​కళ్యాణ్ భేటీ అయ్యాడు. రాపాక పార్టీ లైన్​దాటాడు. కాబట్టి జనసేన కార్యకర్తలు ఎవరూ అతడికి సపోర్ట్​ చేయొద్దని తేల్చిచెప్పాడట. వచ్చే ఎన్నికల్లో అతడికి టిక్కెట్​ ఇవ్వబోమనని కూడా చెప్పాడట.

ఇప్పుడు జరుగుతున్న స్థానికసంస్థల ఎన్నికల్లో పార్టీకార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలు పార్టీ లైన్​కు కట్టుబడి ఉండాలని సూచించారట. రాపాక పెట్టిన అభ్యర్థులకు ఎవరూ సహకరించకూడదని చెప్పారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థులను గెలిపించి పార్టీ సత్తా చాటాలని సూచించారట. ఈ నియోజకవర్గానికి పార్టీ త్వరలోనే కొత్త ఇంచార్జిని నియమిస్తుందని.. కార్యకర్తలు, నాయకులు పార్టీ నిర్ణయాలకు కట్టబడి ఉండాలని సూచించారట.

అయితే రాజోలు నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలు పార్టీ అధిష్టానానికి విధేయంగానే ఉన్నారని వారు కూడా చెప్పినట్టు సమాచారం. మొత్తం మీద పార్టీ లైన్​ దాటిన రాపాకను జనసేనాని అటునుంచి నరుక్కొస్తున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Advertisement

Similar News