మనదేశంలో పనిగంటలు చాలా ఎక్కువ !

మనదేశంలో ఎక్కువమంది జనం ఇప్పుడు పనిమంత్రం జపిస్తున్నారు. యంత్రాల్లా పనిచేస్తున్నారు. ఉద్యోగమైనా వ్యాపారమైనా మరే కెరీరైనా కష్టపడితే కానీ ఫలితం ఉండదనే ఫిలాసఫీని ఆచరిస్తూ నిరంతరం బిజీగా ఉంటున్నారు. విలాసవంతమైన జీవితం సొంతం చేసుకోవాలని తహతహ లాడుతున్నారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అందిస్తున్న వివరాలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి. భారతీయులు… నగరాల్లో నివసించేవారు సగటున వారానికి 53 నుండి 54 గంటలు పనిచేస్తున్నారు. మగవారు ఈ సగటుకంటే ఎక్కువగా వారానికి 60 నుండి 84 […]

Advertisement
Update: 2020-11-13 23:42 GMT

మనదేశంలో ఎక్కువమంది జనం ఇప్పుడు పనిమంత్రం జపిస్తున్నారు. యంత్రాల్లా పనిచేస్తున్నారు. ఉద్యోగమైనా వ్యాపారమైనా మరే కెరీరైనా కష్టపడితే కానీ ఫలితం ఉండదనే ఫిలాసఫీని ఆచరిస్తూ నిరంతరం బిజీగా ఉంటున్నారు. విలాసవంతమైన జీవితం సొంతం చేసుకోవాలని తహతహ లాడుతున్నారు.

నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అందిస్తున్న వివరాలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి. భారతీయులు… నగరాల్లో నివసించేవారు సగటున వారానికి 53 నుండి 54 గంటలు పనిచేస్తున్నారు. మగవారు ఈ సగటుకంటే ఎక్కువగా వారానికి 60 నుండి 84 గంటల వరకు కష్టపడుతున్నారు. అయితే వీరు ఇళ్లలో పనిచేసే సమయం మాత్రం చాలా తక్కువ. భారత్ లో గ్రామాల్లో కూడా వారానికి సగటున 46 గంటలు పనిచేస్తున్నారు.

దక్షిణ కొరియాలో 2018 వరకు వారానికి పనిగంటలు సగటున 68 ఉండేవి. అయితే శ్రామిక ఉత్పాదకత పెరిగి జననాల రేటు బాగా తగ్గిపోయింది. 1990 నుండి ఈ మార్పుని గమనించారు. దాంతో ప్రభుత్వం పనివేళల్లో మార్పులు చేసింది. ఇప్పుడు అక్కడ అత్యధిక పనిగంటలు వారానికి 52 మాత్రమే.

డెన్మార్క్ లో వారానికి పనిగంటలు సగటున 37.2 మాత్రమే. కేవలం 2.3 శాతం మంది ఉద్యోగులు మాత్రమే వారానికి యాభై గంటలకంటే ఎక్కువ సమయం పనిచేస్తారు. ఫ్రెంచ్ లో ఏడురోజుల పనిగంటలు 39 కాగా… ఈ సంఖ్య అమెరికాలో 41.5, కొలంబియాలో దాదాపు 50గా ఉంది. మనదేశంలో కరోనా కారణంగా తగ్గిన ఉత్పత్తిని పెంచడానికి కొన్ని రాష్ట్రాల్లో పనిగంటలను సవరించారు. దాంతో రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, హిమాచల ప్రదేశ్ రాష్ట్రాల్లో వారానికి సగటున పనిగంటలు ఇప్పుడు 72.

మనదేశంలో వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు 26 వారాలు. ఇంతకుముందు 12వారాలున్న ప్రసూతి సెలవులను మేటర్నటీ బెనిఫిట్ (ఎమెండ్ మెంట్) చట్టం 2017 ప్రకారం సవరించి పెంచారు. ప్రపంచంలోనే మేటర్నటీ సెలవులు ఎక్కువ ఉన్న దేశాల్లో మనది కూడా ఒకటి. ఈస్టోనియాలో ఈ సెలవులు 85 వారాలు. ప్రపంచంలో కెల్లా ఇక్కడే ప్రసూతి సెలవులు ఎక్కువ. హంగేరిలో 72 వారాలు మేటర్నటీ లీవులు ఇస్తున్నారు.

Advertisement

Similar News