ఎన్నికల నిర్వహణపై ఈసీ భేటీ

తన హయాంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటిరెండు కరోనా కేసులున్నప్పుడు ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ… ఇప్పుడు తన పదవీకాలం ముగింపు దగ్గరపడుతుండడంతో ఆ లోపే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకు టీడీపీ కూడా వంతపాడుతోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించేలా ఆదేశించండి అంటూ హైకోర్టుకు వెళ్లిన నిమ్మగడ్డ… కోర్టు నుంచి ఇంకా తీర్పురాకముందే.. రాజకీయ పార్టీలతో చర్చలకు సిద్ధమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈనెల 28న […]

Advertisement
Update: 2020-10-22 23:34 GMT

తన హయాంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒకటిరెండు కరోనా కేసులున్నప్పుడు ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ… ఇప్పుడు తన పదవీకాలం ముగింపు దగ్గరపడుతుండడంతో ఆ లోపే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకు టీడీపీ కూడా వంతపాడుతోంది.

ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించేలా ఆదేశించండి అంటూ హైకోర్టుకు వెళ్లిన నిమ్మగడ్డ… కోర్టు నుంచి ఇంకా తీర్పురాకముందే.. రాజకీయ పార్టీలతో చర్చలకు సిద్ధమయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈనెల 28న అన్ని రాజకీయ పార్టీలతో విజయవాడ ఎన్నికల కమిషనర్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్టు రమేష్ కుమార్‌ ప్రకటించారు. ఇందుకు రాజకీయపార్టీలను ఆయన ఆహ్వానించారు. రాజకీయ పార్టీలతో చర్చించి ఆ తర్వాత ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు.

Advertisement

Similar News