ఊడిన రఘురామకృష్ణంరాజు పదవి

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్టాండింగ్ కమిటీ చైర్మన్‌ పదవిని కోల్పోయారు. ఇప్పటి వరకు సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉంటూ వచ్చారు. వైసీపీ కోటాలో ఆయనకు ఆ పదవి గతేడాది ఇచ్చారు. ఆయన స్థానంలో బాలశౌరి పేరును వైసీపీ సూచించడంతో… తాజాగా సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా బాలశౌరిని నియమించారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తనను పదవి నుంచి తొలగించలేదని… పదవీకాలం ముగియడంతో రెన్యువల్ చేయకుండా తన […]

Advertisement
Update: 2020-10-16 21:06 GMT

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్టాండింగ్ కమిటీ చైర్మన్‌ పదవిని కోల్పోయారు. ఇప్పటి వరకు సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉంటూ వచ్చారు. వైసీపీ కోటాలో ఆయనకు ఆ పదవి గతేడాది ఇచ్చారు. ఆయన స్థానంలో బాలశౌరి పేరును వైసీపీ సూచించడంతో… తాజాగా సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా బాలశౌరిని నియమించారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

తనను పదవి నుంచి తొలగించలేదని… పదవీకాలం ముగియడంతో రెన్యువల్ చేయకుండా తన స్థానంలో బాలశౌరిని నియమించారని రఘురామకృష్ణంరాజు చెప్పారు. ఈ పదవిని బాలశౌరికి తానేసిన ముష్టిగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు.

అమరావతి రెఫరెండంగా ఎన్నికలకు వస్తే తాను రెండు లక్షల మెజారిటీతో గెలుస్తానని ప్రకటించారు. నేరుగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పోటీ చేసినా సరే రెండు లక్ష ఓట్ల తేడాతో జగన్‌మోహన్ రెడ్డిని ఓడిస్తానన్నారు. ఇది తన సవాల్ అని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

Advertisement

Similar News