మావోయిస్టు అగ్రనేత లొంగిపోతున్నాడా?

మావోయిస్టు అగ్రనేత, పార్టీ మాజీ కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు లొంగిపోతున్నట్లు ప్రముఖ పత్రిక ఒక కథనం వెలువరించింది. ఆయన అనారోగ్య కారణాల వల్ల లొంగిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. మావోయిస్టు పార్టీ నేతృత్వం నుంచి వైదొలిగి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న గణపతి గత కొంత కాలంగా ఉబ్బసం, మధుమేహం, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. ఆయన పార్టీలో కొనసాగుతుండటంతో చికిత్స తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో గణపతి గత కొంత […]

Advertisement
Update: 2020-08-31 22:00 GMT

మావోయిస్టు అగ్రనేత, పార్టీ మాజీ కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు లొంగిపోతున్నట్లు ప్రముఖ పత్రిక ఒక కథనం వెలువరించింది. ఆయన అనారోగ్య కారణాల వల్ల లొంగిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.

మావోయిస్టు పార్టీ నేతృత్వం నుంచి వైదొలిగి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న గణపతి గత కొంత కాలంగా ఉబ్బసం, మధుమేహం, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. ఆయన పార్టీలో కొనసాగుతుండటంతో చికిత్స తీసుకోవడం కూడా కష్టంగా మారింది.

ఈ నేపథ్యంలో గణపతి గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోవడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ఆయన సన్నిహితులు ప్రభుత్వానికి వర్తమానం పంపించారని, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆయన లొంగుబాటుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

గణపతి లొంగుబాటు మావోయిస్టు క్యాడర్‌కు పెద్ద ఎదురు దెబ్బే. కానీ ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తుంచుకుంటే.. ఈ లొంగుబాటు పెద్ద సమస్య కాబోదని కూడా పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. గణపతి లొంగుబాటకు తెలంగాణ పోలీసులే చొరవ తీసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుత జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌కు చెందిన గణపతి అసలు పేరు ముప్పాల లక్ష్మణరావు. ఉపాధ్యాయ వృత్తి నుంచి అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరిన ఆయన నక్సలైటు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. 2005లో ఏర్పడిన మావోయిస్టు పార్టీకి తొలి కార్యదర్శిగా గణపతి ఎన్నికయ్యారు. సుదీర్ఘ కాలంపాటు ఆయన అదే పదవిలో కొనసాగారు. అయితే అనారోగ్య కారణాల రిత్యా తనంతట తానే కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవడంతో.. మావోయిస్టు పార్టీ నంబాల కేశవరావును కార్యదర్శిగా ఎన్నుకుంది. గణపతికి భార్య విజయ, కుమారుడు వాసుదేవరావు ఉన్నారు.

Advertisement

Similar News