కరోనాని ఎదుర్కొనే శక్తి మహిళల్లో ఎక్కువగా ఉందా?!

మగవారిలో కంటే మహిళల్లో కరోనాని ఎదుర్కొనే శక్తి ఎక్కువగా ఉంటుందా… అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. మహిళల్లో ఉండే టి కణాలు బలంగా ఉండటం వల్ల వారు పురుషులకంటే సమర్ధవంతంగా కరోనాని ఎదుర్కొంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. టి కణాన్ని టి లింఫోసైట్ అని కూడా అంటారు. ఇవి ఒకరకమైన తెల్లరక్తకణాలు. ఇవే మనలోని రోగనిరోధక శక్తిని నిర్ణయిస్తాయి. టి సెల్స్ బలంగా ఉన్న వ్యక్తిలో రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందన్నమాట. మగవారిలో కంటే ఈ టి […]

Advertisement
Update: 2020-08-27 02:18 GMT

మగవారిలో కంటే మహిళల్లో కరోనాని ఎదుర్కొనే శక్తి ఎక్కువగా ఉంటుందా… అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. మహిళల్లో ఉండే టి కణాలు బలంగా ఉండటం వల్ల వారు పురుషులకంటే సమర్ధవంతంగా కరోనాని ఎదుర్కొంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది.

టి కణాన్ని టి లింఫోసైట్ అని కూడా అంటారు. ఇవి ఒకరకమైన తెల్లరక్తకణాలు. ఇవే మనలోని రోగనిరోధక శక్తిని నిర్ణయిస్తాయి. టి సెల్స్ బలంగా ఉన్న వ్యక్తిలో రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందన్నమాట.

మగవారిలో కంటే ఈ టి సెల్స్ ఆడవారిలోనే శక్తివంతంగా ఉన్నాయని… అందుకే వారిలో కోవిడ్ 19 ని ఎదుర్కొనే శక్తి ఎక్కువగా ఉంటున్నదని ఒక అధ్యయనం చెబుతోంది. ఈ వివరాలను నేచర్ అనే పత్రికలో ప్రచురించారు. అమెరికాలోని యేల్ న్యూ హెవెన్ హాస్పటల్ లో 18 ఏళ్లు పైబడిన 86మంది కోవిడ్ 19 పేషంట్లపై ఈ అధ్యయనం నిర్వహించారు.

ఇంతకుముందు కూడా కోవిడ్ 19 తీవ్రత మగవారిలోనే ఎక్కువగా ఉన్నదని పరిశోధనలు వెల్లడించినా అందుకు గల కారణాలు ఏమిటో తెలియలేదు. ఇప్పుడు ఈ విషయంలో స్పష్టత వచ్చింది.

పరిశోధకులు ఏమంటున్నారంటే…

టీ కణాలు రోగనిరోధక వ్యవస్థలో ముఖ్యపాత్రని పోషిస్తాయి. ఇన్ ఫెక్షన్ కి గురయిన కణాలను చంపటంలో కూడా వీటిదే ప్రధాన బాధ్యత. టి సెల్స్ సరిగ్గా స్పందించలేకపోవటం వలన మగవారిలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. పెద్దవయసున్న మగవారు కోవిడ్ కి గురయినప్పుడు టి కణాల స్పందన మరీ తక్కువగా ఉంటోంది. కానీ మహిళల్లో మాత్రం ఇలాంటి పరిస్థితి లేదు. మగవారికి టి సెల్స్ ప్రతిస్పందనలను పెంచే చికిత్స చేయటం ద్వారా కోవిడ్ 19 ని తగ్గించడంలో మంచి ఫలితాలను పొందవచ్చు.

Advertisement

Similar News