టీడీపీ నేత నివాసంలో కోటి నగదు, 9కిలోల బంగారం లభ్యం

ఆప్కో మాజీ చైర్మన్, టీడీపీ నేత గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారం బయటపడింది. కడప జిల్లా ఖాజీపేటలోని శ్రీనివాసు నివాసంలో బయటపడ్డ నగదు, బంగారం చూసి అధికారులే నివ్వెరపోయారు. శ్రీనివాసులు ఇంట్లో 91 లక్షల 67వేల రూపాయల నగదు, 9. 9 కిలోల బంగారం, 16 కేజీల వెండి బయడపడింది. 10 లక్షల విలువైన పాత వెయ్యి రూపాయల నోట్లు లభించాయి. టీడీపీ హయాంలో ఆప్కోలో […]

Advertisement
Update: 2020-08-21 20:46 GMT

ఆప్కో మాజీ చైర్మన్, టీడీపీ నేత గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారం బయటపడింది.

కడప జిల్లా ఖాజీపేటలోని శ్రీనివాసు నివాసంలో బయటపడ్డ నగదు, బంగారం చూసి అధికారులే నివ్వెరపోయారు. శ్రీనివాసులు ఇంట్లో 91 లక్షల 67వేల రూపాయల నగదు, 9. 9 కిలోల బంగారం, 16 కేజీల వెండి బయడపడింది. 10 లక్షల విలువైన పాత వెయ్యి రూపాయల నోట్లు లభించాయి.

టీడీపీ హయాంలో ఆప్కోలో భారీగా అక్రమాలు జరిగినట్టు గుర్తించిన సీఐడీ అధికారులు కోర్టు అనుమతితో శ్రీనివాసులు ఇంట్లో సోదాలు నిర్వహించారు. తన జోలికి ఎవరొస్తారులే అన్న ధీమాతో ఉన్న శ్రీనివాసులు… ఇంట్లోనే భారీగా నగదు, బంగారం ఉంచుకున్నాడు. బోగస్ సొసైటీలను కాగితాలపై చూపి కోట్లు కాజేసినట్టు సీఐడీ విచారణలో తేలింది.

Advertisement

Similar News