కరోనా మరణాల్లో 4వ స్థానానికి ఇండియా

ఇండియాలో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. మన దేశంలో కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వాళ్ల సంఖ్య ఆందోళనకు గురి చేస్తున్నది. ప్రతీ రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవడమే కాకుండా మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం కలవరపెడుతున్నది. ఇప్పటికే 23,96,637 మంది కరోనా పాజిటివ్ రోగులతో ప్రపంచంలో 3వ స్థానానికి చేరుకున్న ఇండియా.. తాజాగా కరోనా మరణాల్లో కూడా రికార్డు సృష్టిస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 942 మంది కోవిడ్-19 కారణంగా […]

Advertisement
Update: 2020-08-13 01:00 GMT

ఇండియాలో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. మన దేశంలో కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వాళ్ల సంఖ్య ఆందోళనకు గురి చేస్తున్నది. ప్రతీ రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవడమే కాకుండా మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం కలవరపెడుతున్నది. ఇప్పటికే 23,96,637 మంది కరోనా పాజిటివ్ రోగులతో ప్రపంచంలో 3వ స్థానానికి చేరుకున్న ఇండియా.. తాజాగా కరోనా మరణాల్లో కూడా రికార్డు సృష్టిస్తున్నది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 942 మంది కోవిడ్-19 కారణంగా మృత్యువాతపడ్డారు. దీంతో గురువారం నాటికి మొత్తం మరణాల సంఖ్య 47,033కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

కోవిడ్ మరణాలు అత్యధికంగా సంభవిస్తున్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానానికి చేరింది. గతంలో బ్రిటన్ ఉండగా.. తాజా మరణాల సంఖ్యతో భారత్ ఆ స్థానానికి చేరింది.

గురువారం నాటికి బ్రిటన్‌లో 46,700 మరణాలు సంభవించాయి. ఇక దేశంలో సగటున 60 వేల పాజిటివ్ కేసులు ప్రతీ రోజు బయటపడుతున్నాయి. బుధవారం ఒక్కరోజు 66,999 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.

మరోవైపు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. నిన్న 56 వేల మంది రోగం నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరు మొత్తం 16.95 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో రికవరీ రేటు 70 శాతంగా ఉంది.

Tags:    
Advertisement

Similar News