సీమ ఎత్తిపోతల పథకానికి జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదం

రాయలసీమ, నెల్లూరు జిల్లాల కరువు నివారణ కోసం ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ల నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్ అయింది. ఈ పథకానికి సంబంధించిన టెండర్ల ప్రతిపాదనలను జ్యుడిషియల్ ప్రివ్యూకు ఇటీవల పంపించారు. వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి వాటి ఆధారంగా కొన్ని మార్పులను ప్రతిపాదిస్తూ జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి జస్టిస్‌ బి. శివశంకర్‌ రావు టెండర్ల ప్రతిపాదలను శనివారం ఆమోదించారు. ప్రివ్యూలో సూచించిన మార్పులతో టెండర్లు పిలువనున్నారు. రాయలసీమ ఎత్తిపోతల […]

Advertisement
Update: 2020-07-26 21:53 GMT

రాయలసీమ, నెల్లూరు జిల్లాల కరువు నివారణ కోసం ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ల నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్ అయింది. ఈ పథకానికి సంబంధించిన టెండర్ల ప్రతిపాదనలను జ్యుడిషియల్ ప్రివ్యూకు ఇటీవల పంపించారు. వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి వాటి ఆధారంగా కొన్ని మార్పులను ప్రతిపాదిస్తూ జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి జస్టిస్‌ బి. శివశంకర్‌ రావు టెండర్ల ప్రతిపాదలను శనివారం ఆమోదించారు. ప్రివ్యూలో సూచించిన మార్పులతో టెండర్లు పిలువనున్నారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకంలో భాగంగా సంగమేశ్వరం వద్ద నుంచి నీటిని ఎత్తిపోయనున్నారు. 800 అడుగల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు నీటికి ఈ పథకం ద్వారా ఎత్తిపోసి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు అందిస్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం రూ.3,278 కోట్లు. 30 నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని టెండర్ల ప్రతిపాదనలతో ప్రభుత్వం స్పష్టం చేసింది. రోజుకు మూడు టీఎంసీల నీటిని ఈ పథకం ద్వారా లిఫ్ట్ చేస్తారు.

నీటిని ఎత్తిపోసేందుకు మొత్తం 12 పంపులను ఏర్పాటు చేస్తారు. ఒక్కో పంపు ద్వారా 2వేల 893 క్యూసెక్కుల నీటిని తరలిస్తారు. ఇలా మొత్తం12 పంపుల ద్వారా 34వేల 722 క్కూసెక్కుల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News