మళ్లీ మండలి ముందుకు మూడు రాజధానుల బిల్లు

మూడు రాజధానుల బిల్లును శాసనసభ రెండోసారి ఆమోదించింది. ఈ బిల్లు మండలి ముందుకు రాబోతోంది. ఇది వరకే ఒకసారి జనవరి 20న ఈ మూడు రాజధానుల బిల్లును శాసనసభ ఆమోదించి శాసనమండలికి పంపింది. అక్కడ టీడీపీకి మెజారిటీ ఉండడంతో బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకుంది. అంతటితో ఆగకుండా విచక్షణాధికారులు ఉపయోగిస్తూ శాసనమండలి చైర్మన్… బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టు ప్రకటించారు. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని భావిస్తే ముందే నోటీసులు ఇవ్వాలని… అలాంటి పద్దతి ఏమీ పాటించకుండా […]

Advertisement
Update: 2020-06-17 01:15 GMT

మూడు రాజధానుల బిల్లును శాసనసభ రెండోసారి ఆమోదించింది. ఈ బిల్లు మండలి ముందుకు రాబోతోంది. ఇది వరకే ఒకసారి జనవరి 20న ఈ మూడు రాజధానుల బిల్లును శాసనసభ ఆమోదించి శాసనమండలికి పంపింది. అక్కడ టీడీపీకి మెజారిటీ ఉండడంతో బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకుంది. అంతటితో ఆగకుండా విచక్షణాధికారులు ఉపయోగిస్తూ శాసనమండలి చైర్మన్… బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టు ప్రకటించారు. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని భావిస్తే ముందే నోటీసులు ఇవ్వాలని… అలాంటి పద్దతి ఏమీ పాటించకుండా చైర్మన్‌ ఏకపక్షంగా వ్యవహరించారని అధికారపార్టీ భగ్గుమంది.

బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపేందుకు అవసరమైన నిబంధనలను, పద్దతులను పాటించలేదని… కాబట్టి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం సాధ్యం కాదని మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు స్పష్టం చేశారు. తాను ఆదేశిస్తున్నానని… బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందేనని మండలి చైర్మన్ ఒత్తిడి తెచ్చినా రెండుసార్లు కూడా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని మండలి కార్యదర్శి ఫైల్‌ను తిరస్కరించారు. దాంతో వ్యవహారం పెండింగ్‌లో ఉండిపోయింది.

నిబంధనల ప్రకారం శాసనసభ ఆమోదించి పంపిన బిల్లుపై మూడు నెలల్లోగా శాసనమండలి తన అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుంది. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో మరోసారి అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించారు. శాసనసభ ఆమోదించిన బిల్లును మరోసారి శాసనమండలికి పంపుతారు. నెలలోగా శాసనమండలి తన నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. రెండోసారి బిల్లును శాసనమండలి తిరస్కరించినా దానికి విలువ ఉండదు. రెండోసారి బిల్లును మండలి తిరస్కరిస్తే శాసనసభ నిర్ణయమే అంతిమం అవుతుంది. కాబట్టి శాసనమండలి బిల్లును జాప్యం చేయవచ్చు కానీ…దాన్ని అడ్డుకోలేదు. శాసనసభ నిర్ణయమే అంతిమం అవుతుంది.

Tags:    
Advertisement

Similar News