నాలుగు రోజుల్లో 900 మంది కోవిడ్ మృతులు.. ఇండియాలో ప్రమాదకరంగా మారిన కరోనా

ఇండియా ఇప్పుడు నిజంగానే కరోనాతో సహజీవనం చేస్తోంది. కరోనా వ్యాపిస్తున్న తొలిరోజుల్లో కట్టుదిట్టంగా అమలు చేసిన నిబంధనల వల్ల మనం వైరస్ నుంచి దూరంగా జరిగాము. కానీ.. ఎప్పుడైతే కేంద్రం లాక్‌డౌన్ నిబంధనలు సడలించుకుంటూ వచ్చిందో.. ఆనాటి నుంచి మన దేశంలో పాజిటివ్ కేసులు, మృతులు పెరుగుతూ వస్తున్నాయి. ఇండియాలో తొలి మరణం సంభవించిన తర్వాత వెయ్యి మరణాలు చేరడానికి 48 రోజుల సమయం పట్టగా.. ఇప్పుడు నాలుగు రోజులకే వెయ్యి మంది చనిపోతున్నారు. ఈ ఒక్క […]

Advertisement
Update: 2020-06-05 07:34 GMT

ఇండియా ఇప్పుడు నిజంగానే కరోనాతో సహజీవనం చేస్తోంది. కరోనా వ్యాపిస్తున్న తొలిరోజుల్లో కట్టుదిట్టంగా అమలు చేసిన నిబంధనల వల్ల మనం వైరస్ నుంచి దూరంగా జరిగాము.

కానీ.. ఎప్పుడైతే కేంద్రం లాక్‌డౌన్ నిబంధనలు సడలించుకుంటూ వచ్చిందో.. ఆనాటి నుంచి మన దేశంలో పాజిటివ్ కేసులు, మృతులు పెరుగుతూ వస్తున్నాయి. ఇండియాలో తొలి మరణం సంభవించిన తర్వాత వెయ్యి మరణాలు చేరడానికి 48 రోజుల సమయం పట్టగా.. ఇప్పుడు నాలుగు రోజులకే వెయ్యి మంది చనిపోతున్నారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. మన దేశంలో కరోనా ఎంత తీవ్రంగా విజృంభిస్తోందో.

కేంద్ర ప్రభుత్వంలోని కీలకమైన ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ఆధారంగా జాతీయ మీడియా ఒక అధ్యయనం చేసింది. దీని ప్రకారం దేశంలో తొలి కరోనా కేసు గుర్తించిన 87 రోజుల తర్వాత ఆ సంఖ్య 25 వేలకు చేరుకుంది. ఆ తర్వాత ఆరు వారాలకు 2,26,770 కేసులకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మార్చి 12న తొలి కోవిడ్ మరణం చోటు చేసుకోగా.. ప్రస్తుతం 6,075 మరణాలు సంభవించాయి. మార్చి 12న తొలి మరణం తర్వాత వెయ్యి మరణాలకు చేరడానికి 48 రోజులు పట్టింది. ఆ తర్వాతి వెయ్యి 11 రోజుల్లో, ఆ తర్వాత వెయ్యి 8 రోజులకే నమోదయ్యాయి. కానీ గత నాలుగు రోజుల్లోనే వెయ్యి మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.

లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాతే ఎక్కువగా కేసులు నమోదు కావడం.. అంతే కాకుండా మరణాల రేటు కూడా పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో ప్రతీ రెండు రోజులకు పాతిక వేల కేసులు నమోదు అవుతుండగా.. ప్రతీ నాలుగు రోజులకు వెయ్యి మరణాలు సంభవిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News