20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఏం ఉండబోతున్నాయి?

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశప్రజలను ఉద్దేశించి 33 నిమిషాల పాటు ప్రసంగించారు. దేశ ఆర్ధిక వ్యవస్థ తిరిగి గాడిలో పడాలని 20 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించారు. ఇది మనదేశ జీడీపీలో 10 శాతం అని ప్రధాని చెప్పారు. ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్‌ బుధవారం వివరాలు ప్రకటించ బోతున్నారని ప్రధాని చెప్పారు. అయితే ఇప్పటికే దాదాపు లక్షా 70 వేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. వీటితో పాటు […]

Advertisement
Update: 2020-05-13 01:53 GMT

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశప్రజలను ఉద్దేశించి 33 నిమిషాల పాటు ప్రసంగించారు. దేశ ఆర్ధిక వ్యవస్థ తిరిగి గాడిలో పడాలని 20 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించారు. ఇది మనదేశ జీడీపీలో 10 శాతం అని ప్రధాని చెప్పారు.

ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్‌ బుధవారం వివరాలు ప్రకటించ బోతున్నారని ప్రధాని చెప్పారు. అయితే ఇప్పటికే దాదాపు లక్షా 70 వేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. వీటితో పాటు మరో 18 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్ర ఆర్ధికమంత్రి వివరించబోతున్నారు. అయితే ఇందులో సామాన్యుడికి ఏమైనా ఉపశమనం ఉంటుందా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్యాకేజీలో స్థానం ఉంటుందని ప్రధాని హింట్‌ ఇచ్చారు. కానీ ఇప్పటివరకూ ప్రకటించిన వాటిలో దక్కింది ఏం లేదు. ఆర్‌బీఐ ప్రకటించిన మారటోరియంలో కూడా పలు షరతులు పెట్టారు. ఇప్పుడు ప్యాకేజీలో కూడా పెద్దగా సామాన్యునికి ఉపయోగపడే అంశాలు ఉండకపోవచ్చనేది మాట. డైరెక్టుగా సామాన్యునికి లింక్‌ అయ్యే ఉపశమన చర్యలు ఉంటాయా? అనేది చూడాలి.

21వ శతాబ్దపు ఆకాంక్షలకు తగినట్లుగా ఈ ప్యాకేజీ రూపకల్పన, నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఈ ప్యాకేజీ దోహదం చేస్తుందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. దేశంలో ప్రతి పారిశ్రామికుడిని కలుపుకుని పోయేలా ప్యాకేజీ ఉపయోగపడుతుందని…భారత పారిశ్రామిక రంగానికి మరింత బలం చేకూర్చేవిధంగా ప్యాకేజీ ఉపయోగకరంగా ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News