ఇమ్మిగ్రేషన్‌పై ట్రంప్ సంచలన నిర్ణయం

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇమ్మిగ్రేషన్‌పై కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. కరోనా వైరస్‌ వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో తమ దేశంలోకి వలసలని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు ట్రంప్ ప్రకటించారు. ఈమేరకు అధ్యక్షుడు ఒక ప్రకటన చేశారు. ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులపై త్వరలోనే సంతకం చేస్తానని ప్రకటించారు. సంక్షోభ సమయంలో అమెరికా పౌరుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కరోనా దాడి నేపథ్యంలో అమెరికా […]

Advertisement
Update: 2020-04-20 23:13 GMT

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇమ్మిగ్రేషన్‌పై కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.

కరోనా వైరస్‌ వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో తమ దేశంలోకి వలసలని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు ట్రంప్ ప్రకటించారు. ఈమేరకు అధ్యక్షుడు ఒక ప్రకటన చేశారు. ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులపై త్వరలోనే సంతకం చేస్తానని ప్రకటించారు.

సంక్షోభ సమయంలో అమెరికా పౌరుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కరోనా దాడి నేపథ్యంలో అమెరికా పౌరుల ఉద్యోగాలను రక్షించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అందువల్లే అమెరికాలోకి వలసలని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాం అని ట్వీట్ చేశారు.

ఇమ్మిగ్రేషన్‌ మార్పులు అమలులోకి వస్తే వాటిని తిరిగి ఉపసంహరించుకునే వరకు విదేశీయులెవరూ అమెరికాలోకి ప్రవేశించడానికి అనుమతి ఉండదు. ట్రంప్‌ ప్రకటన చైనా, భారత్‌ పౌరులపైనే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ రెండు దేశాల నుంచే ఎక్కువ మంది అమెరికాకు ఉద్యోగాల కోసం వెళ్తున్నారు.

కరోనా కారణంగా అమెరికా సంక్షోభం వైపు ప్రస్తుతం నడుస్తోంది. త్వరలోనే లక్షలాది మంది ఉద్యోగాలు ఉడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 2.2 కోట్ల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో అమెరికా పౌరుల ఉద్యోగ భద్రత, ఇతర ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఆ దేశానికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో విదేశీ వలసదారులకు చెక్ పెట్టేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు.

Tags:    
Advertisement

Similar News