వైఎస్ మెచ్చిన ఐఏఎస్... లవ్ అగర్వాల్

లవ్ అగర్వాల్… ఈ పేరు తరచుగా మనం ఈ మధ్య వింటున్నాం.. ఆ అధికారిని టీవీల్లో చూస్తున్నాం. కరోనాపై ఎప్పటికప్పుడు తాజా వివరాలను అందిస్తూ దేశ ప్రజలను ఆయన అప్రమత్తం చేస్తున్నారు. ఏపీ ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన ఆయన ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేస్తున్నారు. 1996 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన లవ్ అగర్వాల్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడు. ఏపీలోని పలు పదవుల్లో పని చేసి ప్రస్తుతం కేంద్ర […]

Advertisement
Update: 2020-04-11 23:53 GMT

లవ్ అగర్వాల్… ఈ పేరు తరచుగా మనం ఈ మధ్య వింటున్నాం.. ఆ అధికారిని టీవీల్లో చూస్తున్నాం. కరోనాపై ఎప్పటికప్పుడు తాజా వివరాలను అందిస్తూ దేశ ప్రజలను ఆయన అప్రమత్తం చేస్తున్నారు. ఏపీ ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన ఆయన ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేస్తున్నారు. 1996 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన లవ్ అగర్వాల్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడు. ఏపీలోని పలు పదవుల్లో పని చేసి ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్నారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన సీఎంవోలో కార్యదర్శిగా పని చేశారు. లవ్ అగర్వాల్ పట్టుదల, నిజాయితీని గమనించిన వైఎస్ ఆయనను 2005లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరుగా నియమించారు. ఆ సమయంలోనే వైఎస్ ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ కొల్లేరు’ను చేట్టారు. కొల్లేరు సరస్సులోని ఆక్రమణలను తొలగించడం.. అక్కడి పేదల జీవనాన్ని మెరుగుపరచడం వంటి చర్యలకు పూనుకొన్నారు. రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఆపరేషన్ కొల్లేరును దిగ్విజయంగా పూర్తి చేశారు.

1996లో ఐఏఎస్ శిక్షణ అనంతరం ఆయన కృష్ణా జిల్లాకు, భద్రాచలం అసిస్టెంట్ కలెక్టరుగా పని చేశారు. జూన్ 2000 నుంచి మెదక్ జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్టు అధికారిగా, ఆ తర్వాత అదే జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. 2003లో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర జాయింట్ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారిగా పని చేశారు.

వైఎస్ఆర్ హయాంలోనే ఈపీడీసీఎల్ సీఎండీగా, విశాఖపట్నం కలెక్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News