ఆదివారం గ్రిడ్ కుప్పకూలుతుందా..? విద్యుత్ నిపుణులేం చెబుతున్నారు..?

దేశాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా గత కొన్ని రోజులుగా ఇండ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్ 21 రోజుల్లో ముగుస్తుందా..? అసలు కరోనా వైరస్‌ను కట్టడి చేయగలమా? అనే ఆలోచనలతో ప్రజల్లో ఒకరకమైన నిర్వేదం మొదలైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోడీ దేశ ప్రజలందరికీ ఒక సందేశమిచ్చారు. ప్రజలందరూ ఈ లాక్‌డౌన్‌కు సంఘీభావం తెలియజేయాలని.. ఏప్రిల్ 5 (ఆదివారం) రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు బంద్ చేసి దీపాలు, […]

Advertisement
Update: 2020-04-04 04:34 GMT

దేశాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా గత కొన్ని రోజులుగా ఇండ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్ 21 రోజుల్లో ముగుస్తుందా..? అసలు కరోనా వైరస్‌ను కట్టడి చేయగలమా? అనే ఆలోచనలతో ప్రజల్లో ఒకరకమైన నిర్వేదం మొదలైంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోడీ దేశ ప్రజలందరికీ ఒక సందేశమిచ్చారు. ప్రజలందరూ ఈ లాక్‌డౌన్‌కు సంఘీభావం తెలియజేయాలని.. ఏప్రిల్ 5 (ఆదివారం) రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు బంద్ చేసి దీపాలు, క్యాండిల్స్ వెలిగించాలని పిలుపునిచ్చారు.

మోడీ ఈ సందేశం ఇచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వేలాది మెసేజీలు ఫార్వర్డ్ అయ్యాయి. అన్నింటి సారంశం ఏంటంటే ఒకే సారి లైట్లు ఆర్పేయడం వల్ల గ్రిడ్ కుప్పకూలుతుందని.. తిరిగి పునరుద్దరించాలంటే 16 నుంచి 24 గంటలు పడుతుందని చెప్పుకొచ్చారు. ఏకంగా మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, శశిథరూర్ వంటి సీనియర్ నేతలు కూడా ప్రధాని నిర్ణయాన్ని ఎద్దేవా చేస్తూ.. ట్వీట్లు చేశారు. అంతే కాకుండా తెలంగాణ విద్యుత్ శాఖ ఇంజినీర్లు కూడా ఆందోళన చెందుతున్నారంటూ వాట్సప్ మెసేజీలు వెల్లువెత్తాయి.

ఈ గందరగోళానికి తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెరదించారు. గ్రిడ్ కుప్పకూలుతుందనే వార్తలు అవాస్తవం అన్నారు. లైట్లన్నీ ఒకేసారి ఆపితే పవర్ గ్రిడ్‌పై భారం పడుతుందనే విషయం వాస్తవమే అన్నారు. కానీ తెలంగాణ గ్రిడ్‌కు ఎలాంటి సమస్యలు రాకుండా ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. గ్రిడ్ కుప్పకూలుతుందనే భయం లేకుండా ప్రజలు మోడీ ఇచ్చిన పిలుపును పాటించాలని కోరారు. కరోనా నుంచి భారతదేశం విముక్తి కావాలని ఆయన ఆకాంక్షించారు.

Tags:    
Advertisement

Similar News